ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో పొత్తుల గురించి ఆసక్తికర చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీడీపీ-జనసేనల పొత్తు ఉండొచ్చని ప్రచారం జరుగుతూ వచ్చింది...ఇదే క్రమంలో చంద్రబాబు సైతం పొత్తుల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. . కుప్పం పర్యటనలో ఉన్న బాబుకు ఒక కార్యకర్తని పొత్తు గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలో బాబు దానికి సమాధానం ఆసక్తిగా చెప్పారు...లవ్ అనేది ఏకపక్షంగా ఉండకూడదని, రెండు వైపులా లవ్ ఉండాలని మాట్లాడారు.

అంటే పొత్తు గురించి బాబు రెడీగానే ఉన్న..పవన్ రెడీగా లేరని తెలుస్తోంది. అలాగే పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడేది ఏమి లేదని, అది ఎన్నికల సమయంలో మాట్లాడతామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే పొత్తుపై బాబు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ-జనసేనల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే బాబు అవకాశవాది అంటూ మాట్లాడారు. ఆయన ఎవరినైనా లవ్ చేయగలరని, మళ్ళీ వదిలేయగలరని విమర్శించారు.

అవకాశాన్ని బట్టి లవ్ చేయడంలో బాబు ధిట్ట అంటూ సెటైర్ వేశారు. ఇటు జనసేన నేతల నుంచి కొన్ని కౌంటర్లు వస్తున్నాయి. గతంలో టీడీపీ నేతలు, పవన్ కల్యాణ్‌ని అన్న మాటలు మరిచిపోలేదని, అయినా రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని, ఒక బలమైన వర్గం అండగా తమకు ఉందని, జనసేనకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కొందరు జనసేన నేతలు అంటున్నారు.

అంటే ఈ మాటలు బట్టి చూస్తే బాబు పొత్తు పెట్టుకుందామని అనుకున్న...బీజేపీ-జనసేనలు రెడీగా లేవని చెప్పొచ్చు. ఇదే సమయంలో జనసేనతో పొత్తు అవసరం లేదని...ఒకవేళ పొత్తు పెట్టుకుని గెలిస్తే మొత్తం పవన్ వల్లే అని జనసైనికులు డప్పు కొట్టుకుంటారని, ఆ పరిస్తితి అవసరం లేదని టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి. మొత్తానికైతే టీడీపీ-జనసేనల మధ్య పొత్తు అంత ఈజీగా కుదిరేలా లేదు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: