కరోనా వంటి సాంక్రమిక వ్యాధులు అనగా వైరస్ ల వ్యాప్తి రేటుపై అంచనాకు వచ్చేందుకు 'ఆర్-నాట్ వ్యాల్యూ' ను ఉపయోగిస్తారు. ఒక వ్యక్తికి వైరస్ సోకితే అతడి నుండి ఎంత మందికి వైరస్ సోకుతుంది అన్నది బట్టి ఆర్ నాట్ వ్యాల్యు నిర్ధారించడం జరుగుతుంది. అయితే తాజాగా ఐఐటీ మద్రాస్ విశ్లేషణను బట్టి చూస్తే.. ప్రస్తుతం దేశంలో ఆర్-నాట్ వ్యాల్యూ 4 అని తెలుస్తోంది. అంటే.. కొవిడ్ సోకిన ప్రతి ఒక వ్యక్తి నుంచి సగటున నలుగురికి వైరస్ సోకుతుంది అన్న మాట. దీన్ని బట్టి ఇది కరోనా థర్డ్ వేవ్ నే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే కరోనా ఇలా బీభత్సం సృష్టిస్తున్న తరుణంలో కరోనా వ్యాప్తి, పరిణామాల్ని అంచనా వేసేందుకు ప్రధాని మోదీ 'జాతీయ కొవిడ్ సూపర్ మోడల్ కమిటీ' అనే కమిటీని కోవిడ్ ఏర్పాటు చేయడం జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి