కరోనా వైరస్ మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రోజురోజుకు తెలుగులోకి వస్తున్న కేసులు మల్లి అందరిని భయాందోళనలోకి నెడుతున్నాయి. ఇలా కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూ ఉండడంతో ప్రభుత్వాలు మళ్ళీ కఠిన ఆంక్షలు వెలుగులోకి తీసుకు వస్తున్నాయి. అయితే మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించలేం  అంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉదృతిని బట్టి కఠిన ఆంక్షలు విధిస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవల కాలంలో ఇలా కరోనా వైరస్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగి పోతూ ఉండటం మాత్రం ఆందోళనకరంగానే మారిపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. నైట్  కర్ఫ్యు లాంటివి విధిస్తూ కరోనా వైరస్ కట్టడికి చర్యలు చేపట్టడం మొదలుపెట్టాయి ప్రభుత్వాలు.


 కొన్ని రాష్ట్రాలలో అయితే ఏకంగా వీకెండ్ లాక్ డౌన్ ను కూడా విధిస్తూ ఉండటం గమనార్హం. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఎక్కడ అవకాశం తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం కఠిన ఆంక్షలను  అమలులోకి తీసుకు వస్తుంది అన్న విషయం తెలిసిందే.  కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేటి నుంచి ఈనెల 31 వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా ఈ నైట్ కర్ఫ్యూ అమల్లోకి రాబోతుంది.


 ఈ క్రమంలోనే నిన్నటి వరకు రాత్రి రాత్రి సమయంలో ఎంతో యాదేచ్చగా  తిరిగిన వారు నైట్ కలిగి ఉందని గుర్తు పెట్టుకుంటే మాత్రం ఎంతో మంచిది. ఎందుకంటే నైట్ కర్ఫ్యూ  ఉండడంతో పోలీసులు ఎక్కడికక్కడ గస్తి వస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నైట్ కర్ఫ్యూ సమయంలో రోడ్ల మీదికి వచ్చిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ నైట్ కర్ఫ్యూ ఉంది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని ఇక రాత్రి సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది. అయితే ఇక నైట్ కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవల సిబ్బందికి మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. దూరప్రాంతాలకు వెళ్లే వారికి రవాణా వాహనాలకు కర్ఫ్యూ నుంచి కూడా మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: