ఇప్పటికే హాంకాంగ్ ను మింగేసింది.. టిబెట్ ను తనలో కలిపేసుకుంది. ఇంకా దాహం తీరలేదు అన్నట్లు పొరుగున ఉన్న తైవాన్ నూ కూడా స్వాధీనం చేసుకునేందుకు చైనా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి తైవాన్  విషయంలో చైనా వేస్తున్న ప్రతి అడుగు కూడా ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక గతంలో ఏకంగా తైవాన్ సరిహద్దుల్లో సైనికులను మోహరించి యుద్ధ విన్యాసాలు చేయడంతో ఇక తైవాన్ చైనా మధ్య యుద్ధం తప్పదు అనే విధంగానే మారిపోయింది పరిస్థితి. అదే సమయంలో అమెరికా తైవాన్ కు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు  ప్రకటించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎవరు కూడా తైవాన్ నూ స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు వీలు లేదని తైవాన్ చైనాలో ఒక భాగం అంటూ స్టేట్మెంట్ ఇస్తోంది చైనా   కానీ తాము ఎవరి లో భాగం కాదని స్వతంత్ర దేశం గానే కొనసాగుతున్నాము అంటూ తైవాన్ ఎదురు తిరుగుతూ ఉండటం గమనార్హం. ఆ సమయంలో ఎన్నో దేశాలు తైవాన్ నూ స్వతంత్రదేశంగా గుర్తిస్తూ ముందుకు వస్తున్నాయి. ఇటీవల కాలంలో తైవాన్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు కాస్త సద్దుమణిగింది అని చెప్పాలి. కానీ అప్పుడప్పుడు చైనా మరోసారి వివాదానికి తెర మీదకు తీసుకొచ్చేందుకు చైనా యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలో కి పంపడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇక ఇలా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు కారణం అవుతూ ఉంటుంది చైనా. మరోసారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవలే తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి చైనా కు సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్ వెళ్లడం షాకింగ్ గా మారిపోయింది. అయితే తైవాన్ ఆర్మీ ఒక్కసారిగా అప్రమత్తమై ఎయిర్ క్రాఫ్ట్ పేల్చేందుకు మిసైల్స్    సిద్ధం చేయడంతో చైనా తోక ముడిచిన  పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని మరోసారి ఉద్రిక్తంగా మార్చింది చైనా. ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్న దేశమైన తైవాన్ మాత్రమే చైనా లొంగెందుకు  అసలు సిద్ధంగా లేదు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: