తాడేపల్లి : మూడు రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్ ను జిల్లాగా సీఎం జగన్ ప్రకటించారన్నారు మంత్రి కొడాలి నాని. పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని చోట్ల పలు ప్రాంతాలను కలిపారని.. జిల్లాల పునర్విభజన ప్రక్రియ చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు మంత్రి కొడాలి నాని. 11వేల ఆర్బీకే కేంద్రాలు , గ్రామ సచివాలయాలను సీఎం ఏర్పాటు చేశారని.. అధికార వికేెంద్రీకరణ చేస్తోన్న సీఎంగా సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు మంత్రి కొడాలి నాని. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని 2018 పాదయాత్రలో స్థానికులు వైఎస్ జగన్ ను కోరారు.. జిల్లాల విభజన అనంతరం ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని వైఎస్ జగన్ అప్పుడే హామీ ఇచ్చారన్నారు మంత్రి కొడాలి నాని. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టారు.. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు సీఎంకు పాదాభివందనం చేస్తున్నాని వెల్లడించారు మంత్రి కొడాలి నాని.

ఎన్టీఆర్ ఆశయాలకు వైకాపా వ్యతిరేకం కాదని.. చాలా మందికి చాలా రకాల అభిప్రాయాలున్నాయన్నారు  మంత్రి కొడాలి నాని.  జిల్లాల పునర్విభజన ప్రక్రియలో మార్పులు,  చేర్పులకు అవకాశాలున్నాయి.. ప్రజలు అభ్యంతరాలను  ప్రభుత్వం దృష్టికి తెస్తే పరిష్కరించే ముందుకు వెళ్తామన్నారు  మంత్రి కొడాలి నాని.  గుడివాడలో ఏదో జరిగిందని ఛీర్ బాయ్ లతో చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేశారు.. ప్రతి ప క్ష పాత్ర పోషించేందుకు తెదేపాకు రాష్ట్రంలో  ఏ అంశమూ లేదని పేర్కొన్నారు  మంత్రి కొడాలి నాని.  

ఏ అంశం లేకే గుడివాడ అంశంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడం సహా ఏదేదో చేస్తున్నారు.. చంద్రబాబు 14ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క జిల్లాకూ ఎన్టీఆర్ పేరు పెట్టలేకపోయారన్నారు మంత్రి కొడాలి నాని. భారత రత్న ఇవ్వాలని కోరతాడు.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానంటే చంద్రబాబును ఎవరైనా ఆపారా ..? అని పేర్కొన్నారు మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్ పేరును కూడా చంపేయాలని నీచమైన ఆలోచన చంద్రబాబుది.. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా ఒడిపోయి అందరూ పక్క రాష్ట్రాలకు వెళ్లి ఛీర్ బాయ్స్ గా ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్నారు మంత్రి కొడాలి నాని. ఎజెండా చంద్రబాబు సెట్ చేస్తాడు..సోము వీర్రాజు అమలు చేస్తారన్నారు మంత్రి కొడాలి నాని.  

మరింత సమాచారం తెలుసుకోండి: