అంబేద్క‌ర్ అనే ఓ గొప్ప మ‌హ‌నీయుడి స్మ‌ర‌ణ‌కు గౌర‌వం.. నిత్యం స్మ‌రిస్తూ ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు కృషి చేసేవారికి ఓ గొప్ప ఆనందం.. అవును కోన‌సీమ జిల్లాను అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా ప్ర‌క‌టించాలి.. అవును అమ‌లాపురం కేంద్రంగా ఉన్న వారే కాదు ఇవాళ ఆయ‌న ఆశ‌య సాధ‌న కోసం కృషి చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌కూ ఊహ‌కూ ఓ విధంగా ఓ గొప్ప ఊర‌ట! ఓ గొప్ప కానుక కూడా! ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జిల్లాల పున‌ర్విభ‌జ‌న నేప‌థ్యంలో జ‌గ‌న్ చేయాల్సిన ఆలోచ‌న ఇది..జ‌గ‌న్ చేయాల్సిన కార్యాచ‌ర‌ణ ఇది! మిస్ట‌ర్ సీఎం ఆలోచించండి ఆచ‌ర‌ణ మ‌రువ‌కండి! మా  కోన సీమ త‌ర‌ఫున మీకిదే మా విన్నపం.. రాపాక స‌ర్ వెల్ సెడ్..
 


దేశానికి స్వేచ్ఛ‌ను ప్ర‌సాదించ‌డం ఓవంతు దేశానికి రాజ్యాంగం ప్ర‌సాదించి ఓ గొప్ప ప్ర‌క్రియ‌కు పూనిక వ‌హించ‌డం ఓ వంతు.. ఆ ప్ర‌క్రియ‌కు అంబేద్కర్ సార‌థ్యం వ‌హించారు. ఆజాదీ కా అమృతోత్స‌వ్ జ‌రుపుకుంటున్న ప్ర‌స్తుత త‌రుణాన స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన వేళ అంబేద్క‌ర్ కు మ‌రో సారి ఓ గొప్ప గౌర‌వం అందించాల‌ని జ‌న‌సేన ప్ర‌తిపాదిస్తుంది. ఆ విధంగా చేస్తే గొప్ప వారి  ప‌నుల‌కు గొప్ప‌వారి ఆశ‌యాల‌కు మ‌రింత గుర్తింపు ఇచ్చిన వారం అవుతామ‌ని అభిల‌షిస్తోంది.ద‌టీజ్ జ‌న‌సేన..అవును! ఆ ఆలోచ‌న ఎంతో బాగుంది. అంబేద్క‌ర్ గారికి నివాళి ఇస్తూనే ఇటువంటి మంచి ప‌నులు చేయాలి.. ఇంత‌కూ ఆ ప్ర‌తిపాదిత స్వ‌రం ఏంటంటే.. ఎవ‌రిదంటే ఏమ‌న్న‌దంటే.. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో!

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చాలాచోట్ల నిర‌స‌న‌లు వ‌స్తున్నాయి. చాలా చోట్ల కొత్త కొత్త ప్ర‌తిపాద‌న‌లు కూడా వ‌స్తున్నాయి. ఇదే క్ర‌మంలో  జ‌న‌సేన కూడా త‌న‌దైన ప్ర‌తిపాద‌న చేసింది. ఓ విధంగా జ‌న‌సేన గూటి నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చినా, సాంకేతికంగా ఇంకా ఆయ‌న ఆ  పార్టీ స‌భ్యులే! ఆయ‌నే రాజోలు ఎమ్మెల్యే  రాపాక వ‌ర ప్ర‌సాద్. అవును! ఆయ‌న ఇప్పుడు కొత్త ప్ర‌తిపాదన తీసుకువ‌చ్చారు.


అమ‌లాపురం కేంద్రంగా ఏర్పాట‌య్యే కోన‌సీమ‌కు అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని కోరుతూ ప్ర‌భుత్వానికి విన్న‌వించారు. ఆ విధంగా చేస్తే ఆ మ‌హ‌నీయుడిని స్మ‌రించుకుంటూనే, గౌర‌వించినవారం అవుతామ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డుతున్నారు.తన నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ ఎస్సీలే ఉన్నార‌ని, అదేవిధంగా కోన‌సీమ‌లో మెజార్టీ నియోజ‌క‌వ‌ర్గాలు అన్నీ ద‌ళిత ప్ర‌భావిత ప్రాంతాలే అని..క‌నుక ద‌ళిత జ‌న ఉద్ధార‌కుడిగా, రాజ్యాంగ నిర్మాత‌గా ఆయ‌న‌కు మ‌నం సముచిత గౌర‌వం ఇవ్వ‌డమే కాకుండా ఆ మ‌హ‌నీయుడి ఆశ‌య సాధ‌న‌కు కృషి చేయ‌డం కూడాఓ బాధ్య‌తగా చేసుకోవాల‌ని రాపాక ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: