కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వివిధ రకాల నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. కొన్ని సార్లు కేంద్రం తీసుకునే నిర్ణయాలకు ప్రజలు బలై పోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు గత కొంత కాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవల ఒక సంవత్సరంన్నర కాలం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కలచి వేస్తున్న సమస్య ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటీకరణ చేయడం. ఇందులో ఇప్పటికే కొన్ని ఆస్తులను విదేశీయుల చేతికి వెళ్ళిపోయినా సంగతి తెలిసిందే. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలోనే ఇదే విధంగా చేయడానికి కేంద్రం ఒక ప్రకటన ఇచ్చింది బిల్లును ముందుకు తీసుకొచ్చింది. అప్పుడే వైజాగ్ ప్రజలు ఒక్కటిగా ఒక శక్తిగా మారి దీనిపై పోరాటం చేస్తున్నారు.

మా ఆస్తులు అమ్మేటందుకు మీరెవరు అంటూ ధర్నాలకు దిగారు. ఇదిలా ఉంటే ఇప్పుడు స్టీల్ ప్లాన్ లో ఉన్న కొన్ని సమస్యలను తమకు తామే పరిష్కరించుకోవడానికి ఒక సంఘం ఉంది. ఎక్కడయినా కొన్ని సంఘాలు ఉంటాయి. అయితే స్టీల్ని ప్లాంట్ లో పనిచేసే కార్మికులకు వేతన నియమ నిబంధనల ప్రకారం ఒక ఒప్పందం ఉంది. దాని ప్రకారం వేతనాలు అమలు చేయాలని స్టీల్ ప్లాంట్ యూనియన్ అధ్యక్షులు జె అయోధ్యరామ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయం పట్ల స్టీల్ ప్లాన్ యాజమాన్యం వారు సరిగా స్పందించకపోవడం మరియు వారి సమస్యను పరిస్కరించే దిశగా ప్రణాళికలు లేనందున విసిగిపోయిన కార్మిక సంఘం సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నారు.

వాస్తవానికి ఈ సమ్మె సోమవారం అనగా జనవరి 31 వతేదీన జరగాలని అఖిల పక్షం సైతం నోటీసులు ఇచ్చింది. కానీ ఈ లోపు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్, ఆర్ ఐ ఎన్ ఎల్ యాజమాన్యం కార్మికులతో కూర్చుని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చలో ఇద్దరూ కలిసి ఈ సమస్యపై అన్ని విషయాలు మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఈ సమావేశం అనంతరం కార్మిక సంఘం ఈ సమ్మెను వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. అంతే కాకుండా రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల గురించి ఆలోచించి ఈ నిర్ణయం  తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు. మరి ముందు ముందు ఈ విషయంలో ఏమి జరుగుతుంది? సమ్మె ఎప్పుడు జరగనుంది అన్న విషయాలు తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: