ఉప్పు నిప్పులా మారిన ప్రధాని మోడీ.. సీఎం కేసీఆర్ శనివారం  ముచ్చింతల్ లో ఒకే వేదికను షేర్ చేసుకోబోతున్నారు. కెసిఆర్ కేంద్ర బడ్జెట్ పై మండిపడ్డారు. తనదైన శైలిలో ప్రధానిపై ధ్వజమెత్తారు. ఇద్దరూ ఒకే వేదికను పంచుకోబోతున్నారు.ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటారా..?ఎప్పటిలాగే మాట్లాడుకుంటారా.? అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వారిరువురి మధ్య చినజీయర్ మధ్యవర్తిత్వం వహిస్తారా?ముచ్చింతల ఆధ్యాత్మిక వేదిక వీరిని సమన్వయం చేస్తుందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పై కెసిఆర్ ఫైర్ అయ్యారు.విభజన హామీలు అమలు చేయడం లేదని, రావాల్సిన నిధులు కేటాయించడం లేదని, రాష్ట్ర ప్రయో జనాల కోసం నిధులు కేటాయించాలని కోరినా కేంద్రం నయా పైసా ఇవ్వడంలేదని, లేఖలు రాసిన స్పందించక పోవ డంపై బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మోడీపై తీవ్ర విమర్శలు చేశారు.

 మన సొమ్ము తో మోడీ సోకులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని సవరించాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. కెసిఆర్ చేసిన  వ్యాఖ్యలపై కాంగ్రెస్,బీజేపీలతో పాటు ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలతో పాటు, ముచ్చింతల్ లోని సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

వీరిద్దరూ ఒకే స్టేజిని షేర్ చేసుకోనున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టిసారిస్తూనే కెసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు.దేశానికి సమర్థుడైన నాయకుడు కావాలని పేర్కొన్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్,కేరళ సీఎం పినరయి విజయన్,బీహార్ ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్ తో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో బీజేపీ,టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలోనే మోడీ వస్తుండడంతో ఇద్దరి మధ్య చిన్నజీయర్ మధ్యవర్తిత్వం చేసి చల్లారుస్తారా అనేది చర్చనీయాంశమైంది. వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ పీఎం మోడీ కి స్వాగతం పలికినట్లుగానే కేసీఆర్ కూడా స్వాగతం పలుకుతారు అని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: