ఓటు విలువ గురించి చంద్రబాబునాయుడుకన్నా ఎక్కువ తెలిసిన వారు ఎవరుంటారు ? అలాంటి వ్యక్తి కూడా తాజాగా ఓ మహిళ ఓటు విలువ గురించి చెప్పిన మాటలను వైరల్ చేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఓ మహిళ ఓటు విలువ గురించి ఎవరితోనో చెబుతున్న వీడియో ఒకటుంది. అందులో ఓటు అమ్ముకుని బతికే జీవితం ఎందుకంటు ప్రశ్నించారు. 1 నిముషం 18 సెంకడ్ల నిడివున్న వీడియోలో ఫించన్ గురించి, ఓటు గురించి తన అభిప్రాయాలను చెప్పారు.
ఆవిడ చెప్పటం వరకు ఓకేనే కాని దాన్ని చంద్రబాబు ఎండార్స్ చేయటమే విచిత్రంగా ఉంది. ఓటు విలువ గురించి ఈ పెద్దావిడ చెప్పింది విన్నాక సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆమె ద్వారా ఈ సందేశాన్ని అందచేయాలని అనిపించిందట. అందుకనే ‘అమ్మా నీవంటి అభ్యుదయ ఆలోచనలు కలిగిన మహిళ తెలుగుదేశంపార్టీ అభిమాని అయినందుకు పార్టీ అధ్యక్షుడిగా నాకెంతో గర్వంగా ఉంది’. మీకు అభినందనలు. అంటు ఆవిడ మాట్లాడిన వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వైరల్ చేశారు.
ఓటు విలువ గురించి ఆవిడ మాట్లాడినదానికి చంద్రబాబు ఆలోచనలకు ఏమాత్రం పొంతన లేదు. ఎందుకంటే ఓటు వేయటానికి డబ్బు తీసుకోకూడదు అని ఆవిడ చెప్పారు. మరి అదే ఓటుకోసం రు. 5 కోట్లకు బేరం కుదుర్చుకుని అందులో రు. 50 లక్షల అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ ఎపిసోడ్ లో సూత్రధారిగా పాపులరైన చంద్రబాబు కూడా ఓటు విలువ, అభ్యుదయం లాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పటమే విడ్డూరం.
తాను అధికారంలో ఉన్నపుడు జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికను ఎలా గెలిచింది యావత్ దేశం చూసింది. అప్పట్లో ఓట్ల కోసం కోట్లరూపాయలు కుమ్మరించారని టీడీపీలోనే ఇప్పటికి చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి కూడా ఓటు విలువ గురించి చెప్పిన పెద్దావిడను అభినందిస్తున్నారంటే ఓటు విలువ గురించి చంద్రబాబు కన్నా తెలిసిన వ్యక్తి ఇంకెవరుంటారు ?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి