గత వారం నుండి ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురి చేస్తున్న అంశం ఒక్కటే. రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్యన చోటు చేసుకుంటున్న తీవ్ర పరిణామాలు ఏ క్షణంలో యుద్దానికి దారి తీస్తాయో? అయితే మొదటగా ఈ అంశంలో రష్యా తమ సైన్యాన్ని అంతా ఉక్రెయిన్ సరిహద్దు లలో మోహరింపు చేయడం మరియు యుద్ద విన్యాసాలు చేయడం వంటివి ఒకింత ఉక్రెయిన్ ను ఆగ్రహానికి గురి చేశాయి అని చెప్పాలి. అయినా ఉక్రెయిన్ కు యుద్ధం జరగడం ఇష్టం లేదని మాత్రం తెలుస్తోంది. కానీ సొంత దేశానికి వెన్ను పోటు పొడిచే వాళ్ళు చేస్తున్న కొన్ని కృత్యాల వలన పరిస్థితి ఇంతవరకు వచ్చిందని పక్కన ఉన్న దేశాలు అంటున్న మాట.

అయితే ఇప్పుడు వీరిద్దరి యుద్ధం తో భారత దేశం తెగ టెన్షన్ పడుతోంది. దీనికి కారణం ఏమిటంటే ఉక్రెయిన్ దేశంలో మన భారతీయ ప్రజల ఉండడమే. ఇందుకోసం కొన్ని రోజుల నుండి భారత్ విదేశాంగ శాఖ ఎలాగైనా మన వాళ్ళను ఇండియాకు  తీసుకెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొన్ని చర్చల అనంతరం భారత్ నుండి ఒక విమానం ఈ రోజు రాత్రికి ఉక్రెయిన్ కు రానుంది. ఈ ప్రత్యేక విమానంలో ఉక్రెయిన్ లో ఉన్న భారతదేశ  పౌరులు అంతా రానున్నారు. అయితే ఇక్కడకు రాబోయే విమానం బోయింగ్ 787 ఇందులో కేవలం 200 మంది మాత్రమే కూర్చోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి వీరు మాత్రమే ఇండియాకు రానున్నారు.

అయితే ఇంత దారుణమైన పరిస్థితులకు కారణం అయిన రెండు దేశాల పట్ల ఐక్యరాజ్యసమితి లో భాగమై ఉన్న అన్ని దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇందులో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అత్యవసర సమావేశంలో భారత్ ప్రతినిధి టీ ఎస్ తిరు మూర్తి మాట్లాడుతూ,  రెండు దేశాలు తమ పంతాలను పక్కన పెట్టు కూర్చుని సమస్యలు ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. యుద్ధం వలన జరిగేది ఏమీ ఉండదని ఇకనైనా శాంతి ఒప్పందానికి సిద్దం కావాలని చెప్పారు. మరి త్వరలోనే రెండు దేశాలు శాంతికి వచ్చి యుద్ధం జరగకుండా చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: