నేడు ఉత్తరప్రదేశ్ లో ఆఖరి దశ పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆరు దశల పాటు ఎన్నికలు జరిగాయి. ఉత్తర ప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇప్పటికే 349 స్థానాలకు ఎన్నికలు పూర్తి అయ్యాయి. మిగిలిన 54 స్థానాలకు ఈ రోజు ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఉదయం ౭ గంటలకు ప్రారంభం అయిన ఈ ఎన్నిక సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనున్నాయి. అయితే ఈ రోజు చివరి దశ కావడం వలన ఎన్నికల సంఘం అన్ని భద్రతా చర్యలను తీసుకుంది. ఇంతకు ముందు వరకు జరిగిన ఎన్నికలలోనో కొన్ని గొడవలు జరిగిన విషయం తెలిసిందే.

ఈ రోజు అవి కాస్తా ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఎన్నికలు కూడా జరుగుతుండడంతో అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు ఎన్నికల బరిలో మొత్తం 613 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడవ దశ ఎన్నికలో మొత్తం 2 కోట్ల 600 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవలసి ఉండగా చివరికి ఎందరు తమ ఓటును వేస్తారో తెలియాల్సి ఉంది. మరి ఈ ఎన్నిక ఏ పార్టీకి అనుకూలంగా జరుగుతుంది. ఓటర్లను ఎవరి పక్షాన ఉన్నారో తెలియాలంటే ఈ నెల 10 వర్కౌ ఆగాల్సిందే. మార్చి 10 వ తేదీన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది.

మరి ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తమ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా మరో పార్టీకి అధికారాన్ని కోల్పోతుందా అన్న విషయాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే దీని గురించి మోదీ ఉత్తరప్రదేశ్ నాయకులతో కలిసి మాట్లాడినట్లు తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యానాధ్ మళ్ళీ సీఎం అవుతాడా? లేదా అన్న పలు అంశాలను ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: