నేను ఎమ్మెల్యే మనవడినీ అంటూ ఓ యువకుడు బైక్ నెంబర్ ప్లేట్ పై స్టిక్కర్ అతికించాడు. వివరాల్లోకి వెళితే కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోయిల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఎం ఆర్ గాంధీ మనవడిని అంటూ యువకుడు తన బైక్ నెంబర్ ప్లేట్ రాయించుకున్నాడు. ఇక ఈ నెంబర్ ప్లేట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. సరే పోనీలే నిజంగానే ఎమ్మెల్యే మనవడు ఏమో అందుకే అలా రాయించుకున్నాడు అని అనుకుంటే మాత్రం పొరపాటే.. ఎందుకంటే.. అసలు ట్విస్ట్ ఏంటంటే నాగర్ కోయిల్ ఎమ్మెల్యే ఎం ఆర్ గాంధీ కి అసలు పెళ్లి కాలేదు.
ఇక ఈ విషయం తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. పెళ్లి కాకుండా మనవడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 1980వ సంవత్సరం నుంచి గాంధీ నాగర్కోయిల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వస్తున్నారు. ఒకసారి కూడా గెలవలేదు. కానీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మధుర ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయనకు పెళ్లి కాలేదు. తన కారు డ్రైవరు కన్నన్ ను సొంత మనిషిలా చూసుకుంటాడు గాంధీ. ఇక ఈ కన్నన్ కొడుకే ఇక ఇలా ఎమ్మెల్యే మనవడిని అంటూ స్టిక్కర్ వేసుకున్న యువకుడు అమ్రిష్ అన్న విషయం తెలుస్తుంది. కార్ డ్రైవర్ కన్నన్ ను గాంధీ కొడుకుల చూసుకుంటాడు. కాబట్టి ఇక గాంధీని తాత అవుతాడని ఆ యువకుడు అనుకుంటున్నాడట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి