ఇక ఇప్పుడు మహిళల రక్షణ కోసం జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది అని తెలుస్తోంది. దిశా ఫోర్ వీలర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది జగన్ ప్రభుత్వం. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత చేరువ కావడానికి మరియు మహిళలకు పటిష్టమైన భద్రతను కల్పించేందుకు అంతేకాకుండా క్షేత్రస్థాయిలో మహిళలకు రక్షణ కల్పిస్తూ నేరాలను అరికట్టడానికి కోసం దిశా పెట్రోలింగ్ ని ప్రారంభించింది ప్రభుత్వం. అయితే ఇప్పటికే అన్ని పోలీస్స్టేషన్లకు 900 ద్విచక్ర స్కూటర్లు ప్రభుత్వం చేయడం గమనార్హం. ఇలా పెట్రోల్ నిర్వహించడం వల్ల ఆపదలో ఉన్న మహిళలకు చిన్నారులకు అవసరమైన సహాయం వేగంగా అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది జగన్ ప్రభుత్వం.
ఇక ఇప్పుడు ఫోర్ వీలర్ వాహనాలను కూడా అందించేందుకు సిద్ధమైంది. ఏకంగా 163 ఫోర్ వీలర్ వాహనాలను జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇక జిల్లా యూనిట్ కంట్రోల్ రూం నుంచి నేరుగా ప్రత్యక్ష పర్యవేక్షణ చేసేందుకు అనుగుణంగా ఇక స్పెషల్ జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఈ దిశ పెట్రోలింగ్ వాహనాలు కొనుగోలు కోసం 13.8 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జన సంచారం తక్కువగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో నేరం జరిగేందుకు అవకాశం ఎక్కువగా అన్ని ప్రాంతాలలో కూడా ఇక ఈ వాహనాల ద్వారా పెట్రోల్ నిర్వహిస్తూ ఉంటారు పోలీసులు. ఇక ఏపీలో దిశ చట్టం అమల్లో భాగంగా నేడు ఇక ఈ వాహనాలను సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి