స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ని చంపిన రోజున  భగత్ సింగ్ బలిదానం చేసిన షహీద్ దివస్ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన పంజాబ్ ముఖ్యమంత్రి.. భగత్ సింగ్.. రాజ్ గురు.. సుఖ్ దేవ్ ల విగ్రహాల వద్ద నివాళి అర్పించారు. ఆ తరువాత ఆయనో సంచలన ప్రకటన కూడా చేశారు. ఇక అదేమంటే.. పంజాబ్ రాష్ట్రంలో అవినీతిని రూపుమాపేందుకు వీలుగా ఒక వాట్సాప్ నెంబరును ఆయన ప్రకటించారు.పంజాబ్ రాష్ట్రంలో ఎవరైనా ఎవరికైనా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా ఇంకా అలాగే ఎవరైనా అడిగిన వెంటనే అసలు మరో ఆలోచన అనేదే చేయకుండా 9501200200 వాట్సాప్ నెంబరుకు వివరాలు పంపాలని ఆయన పేర్కొన్నారు. ఇది స్వాతంత్ర్య భగత్ సింగ్ జీవిత త్యాగం చేసిన రోజునే దీనిని లాంచ్ చేయడం చాలా గొప్ప విశేషం అని చెప్పాలి.ఇక ఇదే విషయాన్న పంజాబ్ సిఎం సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టు పెట్టడం జరిగింది.


 పంజాబ్ రాష్ట్రన్ని అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇక అంతేకాదు.. ఈ వాట్సాప్ నెంబరుకు వీడియో లేదంటే ఆడియో క్లిప్ ను కనుక పంపితే.. దాన్ని ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్న సభ్యుల టీం వెరిఫై చేసి వెంటనే తగిన చర్యలు చేపడతారని కూడా పేర్కొన్నారు.అలాగే పంజాబ్ రాష్ట్రాన్ని అవినీతి నుంచి దూరం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఇంకా రాష్ట్రాన్ని అవినీతిమయం కాకుండా కాపాడుకునేందుకు స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే సరైన నివాళిగా పంజాబ్ ముఖ్య మంత్రి పేర్కొన్నారు. ఒట్టి మాటల్లోనే కాదు చేతల్లోనూ సరికొత్త తీరును ప్రదర్శిస్తున్న పంజాబ్ ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారో అనేది చూడాలి. ఇక ఏమైనా కాని తాజా నిర్ణయం భగత్ సింగ్ కు సరైన నివాళిగానే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: