‘వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావటం చారిత్రక అవసరం’ ..ఇది తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య. భవిష్యత్తరాల బాగుకోసం ప్రజలు టీడీపీకి ఓట్లేసి గెలిపించాలని చంద్రబాబు పిలుపిచ్చారు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావటం చారిత్రక అవసరమే. అయితే ఎవరికి అవసరం ? అన్నదే పెద్ద ప్రశ్న. జనాలకైతే పలానా పార్టీయే అధికారంలో ఉండాలని ఉండదు.





తమకు మంచిచేసే వాళ్ళనే ఎన్నుకోవాలని లేదా అధికారంలో ఉన్నవాళ్ళు తమకు మంచి చేయాలని జనాలు కోరుకుంటారు. మరి చారిత్రకావసరం ఎవరికి ? ఎవరికంటే చంద్రబాబు, లోకేష్ కు మాత్రమే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరముంది. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాజకీయ జీవితం చాల దుర్భరంగా ముగుస్తుంది. ఎందుకంటే 2029 ఎన్నికలకు చంద్రబాబు వయసు సుమారు 80ల్లో ఉంటుంది.ఇక అప్పుడు మనసు యాక్టివ్ గా ఉన్నా  చేయగలిగేదేమీ ఉండదు. అందుకనే వచ్చే ఎన్నికలు చంద్రబాబుకే చారిత్రాత్మకం. 





తన కొడుకు లోకేష్ ను సీఎంగా చూడాలనే చంద్రబాబు కోరిక తీరుతుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే లోకేష్ సామర్ధ్యం ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. అదృష్టం ఉంటే తప్ప లోకేష్ కు ముఖ్యమంత్రయ్యే అవకాశమే లేదు. మరిలాంటి నేపధ్యంలో చంద్రబాబు ఏమి చేయాలి ? లోకేష్ ను ఏమి చేయాలి ? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రయి వెంటనే తాను తప్పుకుని లోకేష్ ను సీఎంగా చేస్తారు. అప్పుడు చంద్రబాబు రాజకీయ జీవితం తృప్తిగా ఉంటుంది. అలా కాకపోతే ఏమి చేయాలి ?





ఈ విషయమే చంద్రబాబుకు అర్ధం కావటంలేదు. చంద్రబాబు, లోకేష్ కోసమే టీడీపీ అధికారంలోకి రావాల్సిన చారిత్రకావసరం ఏర్పడింది. పార్టీ అధికారంలోకి రావటం జనాల కోసమో ఇంక దేనికోసమే అని అనుకోవద్దు. మరి చంద్రబాబు అనుకున్నట్లే జనాలు కూడా అనుకోవాలి కదా. నిజంగానే జనాలు అలా అనుకునే వారే అయితే 2019 ఎన్నికల్లో అంత ఘోరంగా ఓడించేవారే కాదు కదా.




మరింత సమాచారం తెలుసుకోండి: