రష్యా-యుక్రెయిన్ ల మధ్య యుద్ధం సామాన్య ప్రజల ప్రాణాలు తీసుకుంది. అన్యం పుణ్యం ఎరుగని అమాయకపు ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయిన దృశ్యాలు హృదయాలను కలిచివేస్తున్నాయి. కుప్పలు తిప్పలు శవాల దిబ్బలు కనిపిస్తున్నా రష్యా కు మనసు కరగడం లేదో ఏమో కానీ యుక్రెయిన్ ప్రజలు మాత్రం తమ బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక విలవిల్లాడిన సంఘటనలు మనము చూశాము. యుక్రెయిన్ లోని బుచా వీదుల్లో ఎదురయిన సంఘటన అందరి హృదయాలను తొలిచేస్తోంది. అక్కడ ఎటు చూసినా మృతదేహాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. అందులో మహిళలు, చిన్నారులు సైతం వుండటం దురదృష్టకరం.

యుక్రెయిన్ రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకోవాలని, అధ్యక్షుడు వొలదిమీర్ జెలేన్‌స్కీని గద్దె దించాలని రష్యా ఆశలకు దారుణంగా బలైన నగరాల్లో బుచా కూడా చేరింది. రష్యా సైన్యం యుక్రెయిన్ పై దంటెత్తిన రెండు మూడు రోజులకే బుచా నగరం పై దాడి మొదలయ్యింది ..అయితే అక్కడ యుక్రెయిన్ సైన్యం ప్రతిఘటించడం తో రష్యా సైన్యం మొదట కాస్త వెనకడుగు వేసింది. అయితే ఆ నగరంలో పోరును మాత్రం ఆపలేదు. అక్కడ ఇపుడు ఎటు చూసినా ప్రజలు రక్తపు మడుగులో పడి ఉండటం చూస్తుంటే రష్యా దళాలు ఎంత దారుణంగా కర్కశంగా అక్కడి వారిపై దాడి చేశారో అర్దం అవుతుంది. ఒకేచోట 300 మందికి పైగా పౌరుల మృతదేహాలకు అక్కడ అంత్యక్రియలు నిర్వహించిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

రష్యా సైన్యం ఒక్కసారిగా బుచా నగర వాసులపై దాడికి దిగింది పౌరులు ప్రదేయపడుతున్న పట్టించుకోకుండా మానవత్వాన్ని పక్కనపెట్టి అమానుషంగా హింసించి చంపారని యుక్రెయిన్ ఆరోపించింది. బుచా నగర వాసుల చేతులు వెనక్కి కట్టి తలవెనుక కాల్చినట్లుగా దృశ్యాలు చెబుతున్నాయని యుక్రెయిన్ తెలిపింది. అంతేకాదు అక్కడి మహిళలను సామూహిక అత్యాచారం చేసి మరీ నిర్దయగా చంపేశారని వారు ఆరోపిస్తున్నారు. కానీ రష్యా మాత్రం ఈ ఆరోపణలను వ్యతిరేకిస్తోంది. తమ సైన్యం అక్కడున్నంత వరకు ఒక్క పౌరుడు కూడా మరణించలేదని ..తాము ప్రజలపై ఎటువంటి దాడి చేయలేదని చెబుతోంది.  కానీ యుక్రెయిన్ మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఒక్కసారి బుచా వీదులు చూస్తే విషయాన్ని వివరించి చెప్పనక్కర్లేదని అంత దారుణంగా అక్కడ వాతావరణం ఘోషిస్తోందని చెబుతున్నారు. అక్కడి వీధులు నిజంగానే ధ్వంసమైన ట్యాంక్ లతో,  చెల్లాచెదురుగా మృతదేహాల తో కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: