సాధారణంగా ఎవరైనా ఏదైనా విషయం నచ్చక పోతే ఇక తమ నిరసనను వ్యక్తం చేయడం చేస్తూ ఉంటారు. ఇలా నిరసన చేసే వారు ఏం చేస్తారు దాదాపు అందరికీ ఐడియా ఉంటుంది. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలి అంటూ కోరడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక మరికొంతమంది దిష్టి బొమ్మలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం ఎవరూ ఊహించని విధంగా నిరసన వ్యక్తం చేశాడు. ఏకంగా ప్రభుత్వ తీరుకు నిరసనగా 350 కిలోమీటర్ల పరిగెత్తాడు. అది కూడా కేవలం 50 గంటల సమయంలోనే. ఇక అతను ఇలాంటి నిరసన వ్యక్తం చేయడానికి పెద్ద కారణమే ఉందండోయ్.


 ఆర్మీలో చేరి దేశ సరిహద్దుల్లో రక్షణ కల్పించాలని అతని కలను నెరవేర్చుకోవాలని ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఆర్మీ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం విడుదల కావడం లేదు.. దీంతో అతను ఎంతగానో నిరాశ చెందాడు. ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించాలంటూ నిరసనకు దిగాడూ. ఈ క్రమంలోనే తనదైన శైలిలో ఏకంగా 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టి నిరసన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే తనలో ఉన్న శక్తిసామర్థ్యాలను ఏకంగా దేశానికి చూపించాడు. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది.


 రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో సురేష్ బిచర్ అనే 24 ఏళ్ల యువకుడు ఉన్నాడు. ఆర్మీలో ఉద్యోగం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే రెండేళ్ల ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షలు మాత్రం వాయిదా వేస్తూ వస్తుంది ప్రభుత్వం. అయితే ఇలా ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షలు ఆలస్యంపై ఢిల్లీలో ఆర్మీ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతు తెలిపేందుకు సురేష్ బిచార్ పరుగులు పెట్టుకుంటూ అక్కడికి వచ్చాడు. రాజస్థాన్ నుండి ఢిల్లీ వరకు పరిగెత్తాడు. రెండేళ్ల నుంచి ఆర్మీలో నియామకాలు జరగలేదని నాగౌర్ సికార్ల నుంచి ఎంతోమంది యువకులు వయసు దాటిపోయి  పరీక్షలకు అనర్హులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సదరు వ్యక్తి. ఇక ఇలా నిరాశలో ఉన్న యువకులు అందరిలో కూడా ఉత్సాహాన్ని నింపేందుకే పరుగులు పెడుతూ రాజస్థాన్ జిల్లా కి వచ్చాను అంటూ చెబుతున్నాడు నగేష్. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Run