ఇదే ఇపుడు ఎవరికీ అర్ధం కావటంలేదు. సినీ సెలబ్రిటీ హోదాలో జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ కు ప్రచారం కొత్తగా అవసరంలేదు. పవన్ జనాల్లోకి అడుగుపెడితే చాలు పబ్లిసిటి దానంతట అదే వచ్చేస్తుంది. పైగా ఇప్పటికే పవన్ రాజకీయ వైఖరిపైన ఆయన తీసుకునే లైన్ పైన జనాల్లో ఒక అభిప్రాయముంది. అలాంటిది కొత్తగా చీప్ పబ్లిసిటీకి కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరమే లేదు. కానీ పవన్ అనంతపురం జిల్లా పర్యటనలో కొత్త వాదం తెరపైకి వస్తోంది. 





ఇంతకీ విషయం ఏమిటంటే ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతులకు పరిహారం అందించేందుకు పవన్ జిల్లాలో పర్యటించారు. కొందరు రైతులను పవన్ పరామర్శించి పార్టీ తరపున తలా లక్ష రూపాయలను అందించారు. నిజంగా ఇది మంచిపనే అనటంలో ఎలాంటి సందేహంలేదు. కానీ వ్యక్తిగతంగా చేసినే పనిని ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోందంటు నానా రచ్చ చేస్తున్నారు. తాను ఇప్పటివరకు 31 మంది రైతులకు పరిహారం అందించినట్లు పవన్ ప్రకటించారు.





ఇక్కడే పవన్లోని పబ్లిసిటి కక్కుర్తి  బయటపడుతోంది. పవన్ చెప్పిన 31 మందిలో 16 మంది అసలు రైతులే కాదట. వారిలో చాలామందికి సెంటు భూమి కూడా లేదని సాక్షి మీడియా బయటపెట్టింది. వారిలో కొందరు కుటుంబకలహాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతేకానీ ఎవరు కూడా వ్యవసాయ సంబంధిత సమస్యలతో చనిపోలేదు. సరే చినిపోయిన కౌలురైతులు, లేదా ఇతరుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇప్పటికే అందినట్లు వాళ్ళ కుటుంబసభ్యులే చెప్పారు.





ఎక్కడైనా ఒకరిద్దరికి పరిహారం అందకపోయుండచ్చు. అయితే ప్రభుత్వం ఎవరినీ ఆదుకోలేదంటు పవన్ నానా గోల చేస్తున్నారు. పైగా తమ భర్తలు చనిపోయిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ తమకు అందుతున్నట్లు కూడా వాళ్ళ భార్యలు చెబుతున్నారు. డబ్బులు ఎప్పుడు తమకు అందాయో కూడా కుటుంబాలు చెబుతున్నపుడు పవన్ ప్రభుత్వంపై ఇంతగా ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటంలేదు. ఇదంతా చూస్తుంటే పవన్ ది మరీ చీపు పబ్లిసిటీయే అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: