ప్రముఖ విద్యాసంస్ధల యజమాని నారాయణ అరెస్టుకు తెలుగుదేశంపార్టీ  రాజకీయరంగు పులిమేస్తోంది. 10వ తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అనేకమంది టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ ను పోలీసులు అరెస్టుచేశారు. పోలీసులు అరెస్టుచేసిన టీచర్లలో ఎక్కువమంది ప్రభుత్వ స్కూళ్ళల్లో పనిచేస్తున్న వారితో పాటు నారాయణ స్కూళ్ళ స్టాఫ్ కూడా ఉన్నారని తేలింది. తిరుపతిలోని నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి మొబైల్ ఫోన్ నుండే ప్రశ్నపత్రాన్ని బయటకు పంపినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.






ప్రశ్నపత్రాల లీకేజీలో క్లైమ్యాక్స్ అన్నట్లుగా మాజీమంత్రి, నారాయణ విద్యాసంస్ధల యజమాని నారాయణను పోలీసులు మంగళవారం హైదరాబాద్ లో అరెస్టుచేశారు. ఎప్పుడైతే నారాయణను పోలీసులు అరెస్టుచేశారో వెంటనే చంద్రబాబునాయుడుతో సహా యావత్ టీడీపీ నేతలు రంగంలోకి దిగేశారు. మాజీమంత్రి అరెస్టు అక్రమమని, కక్షసాధింపని నానా గోల చేస్తున్నారు. ఇంతకాలం ప్రశ్నపత్రాల లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన చంద్రబాబు అండ్ కోయే నారాయణ అరెస్టు కాగానే కక్షసాధిపుంలని గోల చేయటమే విచిత్రంగా ఉంది.






అసలు నారాయణకు నారాయణ విద్యాసంస్ధలకు ఎలాంటి సంబంధంలేదంటు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అరెస్టయిన నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి మొబైల్ నుండే ప్రశ్నపత్రం బయటకు వెళ్ళినట్లు పోలీసులు ఇప్పటికే శాస్త్రీయమైన ఆధారాలను సేకరించారు. అయినా సరే టీడీపీ నేతలు మాజీ మంత్రి అరెస్టు తప్పంటున్నారు.





ఇదే సమయంలో కాపులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపులకు దిగిందంటు టీడీపీ మాజీ ఎంఎల్సీ బత్యాల చెంగల్రాయలు ఆరోపణలు చేయటం మరీ విడ్డూరంగా ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు, నారాయణ అరెస్టు ద్వారా కాపులపై జగన్ కక్షసాధింపులకు దిగినట్లు బత్యాల మండిపడుతున్నారు. నారాయణ అరెస్టుకు కాపు సామాజికవర్గానికి ఏమిటి సంబంధమో అర్ధం కావటంలేదు. నారాయణ తప్పుచేశారని పోలీసులు అరెస్టుచేస్తే దానికి రాజకీయ రంగుపులిమి కాపులపై కక్షసాధింపని రాజకీయం చేయటమే విచిత్రంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: