కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కరోనా వైరస్ వల్ల ఏర్పడుతున్న బాధల గురించి దేవుడికి చెప్పుకుందామని వెళ్తే దేవాలయాలు కూడా మూతపడిన పరిస్థితి. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రముఖ దేవాలయాలు మొత్తం మూతపడ్డాయి. దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా కొనసాగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఎన్నో రోజుల పాటు భక్తులకు దర్శనాలు పై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు టిటిడి అధికారులు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం కరోనా వైరస్ పరిస్థితులు సద్దుమణుగుతు వస్తున్న కొద్దీ భక్తుల దర్శనాల సంఖ్యను కూడా పెంచుతూ వచ్చారు టిటిడి అధికారులు.



 ఇటీవలే సర్వదర్శనం టోకెన్లు కూడా విడుదల చేసి భక్తులకు శుభవార్త చెప్పారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కి వెళ్లాలని  నిర్ణయించుకుని కరోనా వైరస్ కారణంగా వెనకడుగు వేసిన వారు ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్క పడటంతో తిరుపతికి తరలివెళుతున్నారు అనే చెప్పాలి. దీంతో రోజురోజుకీ తిరుపతిలో భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. అదే సమయంలో హుండీ ఆదాయం కూడా భారీగా వస్తూ ఉండడం గమనార్హం. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత కొంతమంది భక్తులు మాత్రమే దర్శనం కోసం అనుమతించడంతో హుండీ ఆదాయం భారీగా తగ్గింది. కానీ ఇప్పుడు మాత్రం కరోనా తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం రావడం గమనార్హం.



 మంగళవారం వేకువజామున నుంచి అర్ధరాత్రి  వరకు భక్తులు సమర్పించిన కానుకలు టీటీడీ అధికారులు లెక్కించారు. ఈ క్రమంలోనే హుండీ ఆదాయం 5.43 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ తర్వాత మొదటి సారి ఇంత అత్యధికంగా హుండీ ఆదాయం లభించిందని పేర్కొన్నారు. ఇక బుధవారం 76 వేల నూట నలభై ఎనిమిది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారనీ టిటిడి అధికారులు తెలిపారు. 39 వేల 208 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిన ట్లు టిటిడి అధికారులు చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ttd