తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య ఒప్పందం జరిగినట్లు ప్రచారం మొదలైంది. వచ్చే ఎన్నికలకు సంబందించి చంద్రబాబు, పవన్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డే అనటంలో ఎవరికీ సందేహాలు లేవు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడిస్తేకానీ టీడీపీ, జనేసేనకు బతుకులేదని ఇద్దరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేకపోతే పార్టీ దాదాపు కనుమరుగైనట్లే.
ఇదే సమయంలో పార్టీపెట్టి పదేళ్ళయినా ఇప్పటివరకు రాజకీయాల్లో జనసేన ఎలాంటి ప్రభావం చూపలేకపోతోంది. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లు తెచ్చుకోవటం కాదు జగన్ ఓటమిలో కీలకపాత్ర పోషించాలని పవన్ కు కసి చాలావుంది. అయితే ఇద్దరి కోరిక తీరాలంటే రెండుపార్టీలు పొత్తు పెట్టుకోకతప్పదు. విడివిడిగా పోటీచేస్తే జగన్ ఇద్దరినీ చింతబరిక తీసుకుని చీదేస్తాడు. అంటే ఇద్దరూ కలిసి పోటీచేసినంతమాత్రాన గెలిచేస్తారనే గ్యారెంటీ ఏమీలేదు.
ఎందుకంటే రాజకీయాల్లో 1+1 ఎప్పుడూ రెండుకాదు. 1+1 రాజకీయాల్లో రెండు కావచ్చు లేదా జీరో కూడా కావచ్చు. సరే ప్రస్తుత విషయానికి వస్తే ఇటు చంద్రబాబు అటు పవన్ ఇద్దరు ముఖ్యమంత్రి కుర్చీమీదే కన్నేసింది వాస్తవం. అందుకనే మధ్యేమార్గంగా సీఎం కుర్చీపీఠం చంద్రబాబుకు వదిలేసి, పవన్ను ఎంపీగా పోటీచేసి కేంద్రంలోకి వెళ్ళిపోవాలనే ప్రతిపాదనను ఇద్దరికీ కావాల్సిన వారు తెచ్చారట. కేంద్రంలో ఎన్టీయే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పవన్ ముందుగా కేంద్రమంత్రిగా వెళితే బావుంటుందని మధ్యవర్తలు ప్రతిపాదన తెచ్చారట.
అంటే చంద్రబాబు సీఎంగా, పవన్ కేంద్రమంత్రిగా పనిచేయాలి. ఇదంతా ఎప్పుడంటే వీళ్ళద్దరితో బీజేపీ కూడా కలిసినపుడే. ఒకవేళ బీజేపీ కలవకపోతే వీళ్ళ మధ్య ఒప్పంద ప్రతిపాదన ఏమవుతుందో చూడాలి. మధ్యవర్తులు తెచ్చిన ప్రతిపాదనకు రెండువైపులా సముఖంగానే ఉన్నారట. కాకపోతే ఒప్పందం సజావుగా వర్కవుటవ్వాలంటే బీజేపీ సహకారంలేకుండా సాధ్యంకాదు. బీజేపీ లేకపోయినా తామిద్దరు పొత్తు పెట్టుకునేందుకు రెడీ అయిపోతే అప్పుడు ఎలాంటి డెవలప్మెంట్లు జరుగుతాయన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి