సాధారణంగా ప్రజా ప్రతినిధులు అంటే ప్రజలకు సేవ చేయడానికి ఎన్నుకోబడతారు. అందుకే ఎలక్షన్లు వచ్చాయంటే చాలు మాకు ఓటేయండి మహాప్రభో అంటూ ప్రజల చుట్టూనే తిరుగుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది నాయకులు మాత్రం అటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటు వేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోకపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అధికారం వచ్చింది అంటే చాలు తమ కంటే గొప్పవారు ఇంకెవరూ లేరు అన్నట్టుగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు.  అయితే ప్రజాప్రతినిధులు హుందాగా నడుచుకుంటే మాత్రమే బాగుంటుంది.  కానీ ఎక్కడైనా కాస్త అతి చేశారు అంటే  అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ విమర్శలకు తావిస్తు ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. ఇటీవలే ఒక కాలేజీ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్ళారు ఒక ఎమ్మెల్యే. అక్కడికి వెళ్లిన తర్వాత ఇక అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ ని పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రిన్సిపల్ ఎమ్మెల్యే పట్ల గౌరవంతో సమాధానం చెప్పడంలో కాస్త తడబడ్డాడు. దీంతో ఏకంగా లెక్చరర్ల అందరిముందే ప్రిన్సిపాల్  పై చేయి చేసుకున్నారు ఎమ్మెల్యే.  ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ఎంత ఎమ్మెల్యే అయితే మాత్రం ఇంత అతి చేయాల్సిన అవసరం లేదేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


 ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.  కాలేజీలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్లారు అధికార పార్టీ జనతాదళ్ ఎమ్మెల్యే శ్రీనివాస్. కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ పనుల గురించి అడిగారు. అయితే ప్రిన్సిపాల్ తన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదు అన్న కారణంతో  ఏకంగా లెక్చరర్లు సహా ఎమ్మెల్యే వెంట వచ్చిన అనుచరులు అందరిముందు ప్రిన్సిపాల్ పై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఇక అసహనంతో ప్రిన్సిపాల్ ని  బెదిరిస్తు ఆయన మీదికి వెళ్లారు. వీడియో వైరల్ గా మారి పోవడం తో ఎమ్మెల్యే పై విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: