ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు వ్యవహారం చూస్తుంటే అమరావతి నిర్మాణం జరగటం అసలు ఇష్టంలేదా అనే అనుమానాలు వస్తున్నాయి. అమరావతి ప్రాంతంలోని కొన్ని భూములను వేలంద్వారా  అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. దీన్ని ఇటు చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళు అటు ఎల్లోమీడియా నానా గోల చేస్తున్నారు. భూములమ్మే అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారంటు చంద్రబాబు నానా మాటలంటున్నారు.





అలాగే నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తిచేసి ప్రముఖ విద్యాసంస్ధ  విఐటీకి అద్దెకు ఇవ్వటానికి ప్రయత్నంచేయటాన్ని కూడా ఎల్లోమీడియా, చంద్రబాబు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత అసలు అమరావతి నిర్మాణం చంద్రబాబు, ఎల్లోమీడియాకే ఇష్టంలేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. భూములను వేలం ద్వారా అమ్మాలన్న ప్రభుత్వం ప్రయత్నాలపై నోటికొచ్చినట్లు మాట్లాడుతుండటమే కారణంగా కనబడుతోంది.





ఇంతకీ విషయం ఏమిటంటే భూములను కుదవపెట్టేశారు.  102 ఎకరాలను సుమారు రు. 1275 కోట్లకు తనఖాపెట్టిన విషయం ఇపుడు బయటపడింది. తానేమో భూములను కుదవపెట్టచ్చు కానీ ఇపుడు జగన్ అమ్ముతుంటే తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు హయాంలో నిర్మాణాలు మొదలైన భవనాలకు కూడా అప్పేచేశారు. ఇపుడా భవనాలను పూర్తిచేసి అద్దెలకిస్తే కనీసం నెలవారీ వడ్డీలు+అసలు కట్టేందుకైనా పనికొస్తుంది కదాని అనుకుంటే దానికీ అడ్డుపడుతున్నారు.





ఎంతసేపు ఆపని చేయటానికి జగన్ కు ఏమధికారం ఉంది ? జగన్ కు ఆ అధికారం ఎవరిచ్చారు ? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. తన హయాంలో కార్పొరేషన్లను కుదవపెట్టడం, భూములను అమ్మేయటం లేదా కుదవపెట్టడానికి చంద్రబాబుకు ఎవరధికారం ఇచ్చారు ? అప్పుడు తనకు అధికారం ఇచ్చిన జనాలే ఇపుడు జగన్ కూ ఇచ్చారన్న కనీసం ఇంగితాన్ని కూడా చంద్రబాబు కోల్పోయారు. చంద్రబాబు హయాంలో భూములను ఈ వేలం ద్వారా వేలం వేయాలన్న జీవో ప్రకారమే ఇపుడు జగన్ కూడా భూముల వేలానికి రెడీఅయ్యారు. దాన్నే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అమరావతిలో భవనాలు కట్టకపోతే కట్టలేదని గోలచేశారు. ఇపుడు కడతామంటె భూములు వేలం వేసేస్తున్నారంటు గోలమొదలుపెట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: