కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇక ఉన్నత పదవులు అధిరోహించేందుకు అవసరమైన కనీస సేవల కాలాన్ని మూడేళ్లకు తగ్గించడం జరిగింది.ఇక ఈ మేరకు 2022, సెప్టెంబర్‌ 20 తేదీతో ఆఫీస్‌ మెమోరాండాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్ జారీ చేసింది. డీఓపీటీ 23.3.2009 తేదీతో జారీ చేసిన నిబంధనలను సమీక్షించిన కేంద్రం యూపీఎస్‌సీ, ఇతర కాంపిటెంట్‌ అథారిటీ సంస్థలను సంప్రదించి సవరణను ఆమోదించడం జరిగింది. ఏడో సీపీసీ పే మ్యాట్రిక్స్‌, పే లెవల్స్‌ను బట్టి పదోన్నతి పొందేందుకు సేవా కాలాన్ని మూడేళ్లకు తగ్గించినట్టు తెలుస్తుంది. ఈ సవరణతో నియామక నిబంధనలు, సర్వీస్‌ నిబంధనల్లో మార్పు రానుంది.లెవల్  1 నుండి లెవల్  2 వరకు ప్రమోషన్ కోసం, కనీస అర్హత సర్వీస్ 3 సంవత్సరాలు ఉండాలి. లెవల్ 2 నుండి లెవెల్ 3 వరకు 3 సంవత్సరాలు, లెవల్ 3 నుండి లెవెల్ 4 వరకు 8 సంవత్సరాలు, లెవెల్ 3 నుండి లెవెల్ 4 మరియు లెవెల్ 4 నుండి లెవెల్ 5 వరకు 5 సంవత్సరాలు ఉండాలి. ఇక , లెవల్  6 నుండి 11కి మారడానికి 12 సంవత్సరాలు సమయం పడుతుంది. 


లెవెల్ 4 నుండి లెవల్ 6 వరకు, లెవల్ 6 నుండి లెవల్ 10 వరకు, లెవల్ 11 నుండి లెవల్ 13 వరకు 10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. లెవెల్ 4 నుండి లెవల్ 11 వరకు 9 సంవత్సరాలు పడుతుందని తెలుస్తుంది .పే మ్యాట్రిక్స్/పే లెవల్స్ ప్రకారం ప్రమోషన్ కోసం సూచనలని ఇంకా జారీ చేయలేదు.ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అతి త్వరలోనే డీఏ పెంచనుంది. ఏడో వేతన కమిషన్‌ ప్రకారం డియర్‌నెస్‌ అలవెన్స్‌ (DA), పింఛన్‌దారులకు డియర్‌నెస్‌ రిలీఫ్‌ (DR) ప్రకటించనుందని తెలిసింది. ఇప్పటికైతే అధికారికంగా చెప్పలేదు గానీ సెప్టెంబర్‌ చివరి వారంలో ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఉద్యోగులకు 34 శాతం డీఏ అమలు చేస్తున్నారు. సెప్టెంబర్లో మరో 4 శాతం పెంచి మొత్తం 38 శాతానికి చేరుస్తారని అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేబినెట్‌ కమిటీ సమావేశం కానుంది. అందులో చర్చించాక డీఏ రేటును ప్రకటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: