భారతీయ భీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ కొత్త పథకాలను అమలు చేస్తూ వస్తుంది.ఈ పథకాల వల్ల మంచి బెనిఫిట్స్ ఉండటంతో చాలా మంది ఇన్సూరెన్స్‌ పాలసీలను తీసుకుంటున్నారు..స్టాక్ మార్కెట్‌ లాంటి లాభాలను పొందే స్థలంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని ప్రజలు అనుకుంటారు.ప్రతిసారీ స్టాక్ మార్కెట్ నుంచి లాభాలు పొందడం అందరికి సాధ్యం కాదు. కొన్నిసార్లు మంచి అనుభం ఉన్న పెట్టుబడిదారులు కూడా భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అందువల్ల, మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ఈ lic ప్లాన్ మీకు ఉత్తమమైన మార్గం అని చెప్పవచ్చు. ఈ పథకంలో మీరు కేవలం రూ. 2079 మాత్రమే నెలవారీ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తం పథకం గురించి చూద్దాం..


ఈ ఇన్సూరెన్స్ కంపెనీపై ప్రజలకు నమ్మకం ఉండటంతో ప్రజలు కూడా ఎల్‌ఐసీలో సులభంగా పెట్టుబడులు పెడుతున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ సంస్థ కాబట్టి గుడ్డిగా నమ్ముతున్నారు. మేము ఇక్కడ మీకు lic ప్లాన్ నంబర్ 914 గురించి తెలుసుకుందాం. ఇది కొన్ని మార్గాల్లో చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ పాలసీ ద్వారా భారీ లాభాలను పొందవచ్చు..


ఈ పాలసీని పొందాలని అనుకుంటే కనీస వయస్సు 8 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు ఉండాలి. ఈ ప్లాన్‌లో మీరు కనీసం 12 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాల వ్యవధిని తీసుకోవాలి. అంటే, మీరు ఈ ప్లాన్‌లో కనీసం 12 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. అయితే పెట్టుబడిని గరిష్టంగా 35 సంవత్సరాలు చేయవచ్చు. కనీసం ఈ పథకంలో మీరు రూ. 1 లక్ష హామీ మొత్తాన్ని ఉంచుకోవాలి..


18 ఏళ్ల వయస్సులో ప్లాన్ నంబర్ 914ను ప్రారంభిస్తే.. పాలసీ తీసుకునే వ్యక్తికి రూ.10 లక్షల బీమా లభిస్తుంది. అలాగే, మీరు 35 సంవత్సరాల పదవీకాలం కలిగి ఉండాలి. అటువంటి సమయంలో ఈ ప్లాన్‌కు సంవత్సరానికి రూ. 24391 ఖర్చవుతుంది. అంటే రూ. 2079 ప్రీమియంను ప్రతి నెలా జమ చేయాల్సి ఉంటుంది. ఈ పథకం కింద 35 ఏళ్ల తర్వాత పెట్టుబడిదారుడికి రూ.48 లక్షలకు పైగా లాభం వస్తుంది.మీకు ఈ పథకం పై ఆసక్తి ఉంటే మీరు కూడా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలను పొందండి..


మరింత సమాచారం తెలుసుకోండి: