ప్రధానమంత్రి ఆదేశాల మేరకు, అన్ని మంత్రిత్వ శాఖలు, శాఖలు మిషన్ మోడ్‌లో మంజూరైన పోస్టులు, ప్రస్తుత ఖాళీలను భర్తీ చేయడానికి కృషి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన కొత్త రిక్రూట్‌లు భారత ప్రభుత్వంలోని 38 మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలో చేరతారు. నియమితులైనవారు వివిధ స్థాయిలలో ప్రభుత్వంలో పాలుపంచుకుంటారు. గ్రూప్-ఎ, గ్రూప్-బి (గెజిటెడ్), గ్రూప్-బి (నాన్ గెజిటెడ్),గ్రూప్-సి వంటివి ఇందులో ఉన్నాయి.
రిక్రూట్‌మెంట్ జరుగుతున్న పోస్టులలో సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ పర్సనల్, సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, ఎల్‌డిసి, స్టెనో, పిఎ ఇన్‌కమ్ ట్యాక్స్, టాక్స్ ఇన్‌స్పెక్టర్, ఎంటిఎస్‌లతో పాటు ఇతర విభాగాలు లేదా పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్‌లు మినిస్ట్రీలు, డిపార్ట్‌మెంట్‌లు తమ సొంతంగా లేదా యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ ద్వారా మిషన్ మోడ్‌లో జరుగుతాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వంటి ఏజెన్సీల ద్వారా రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.ఈ ఉద్యోగ నియామకాలను వేగంగా భర్థీ చేయనున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి