ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెన్షన్ ల తొలగింపు గురించి రచ్చ రచ్చ అవుతోంది. చాలా చోట్ల ఫించను దారులు తమ పేరు లిస్ట్ లో కనిపించడం లేదని గగ్గోలు పెడుతున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ విషయాన్ని ప్రతిపక్ష టీడీపీ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని వైసీపీని మరియు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలు పెట్టింది. ఎవ్వరికైనా నిన్న మొన్నటి వరకు వస్తున్న పెన్షన్ రాకపోతే బాధగానే ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకు వారు చేయాల్సిన పనల్లా సంబంధిత సచివాలయానికి వెళ్లి అక్కడి అధికారులను తొలగింపు గురించిన పూర్తి వివరాలను అడిగితే తెలియచేస్తారు, అంతటితో సమస్య పరిష్కారం అవుతుంది.

కానీ కొందరు ప్రజలు తమకున్న తక్కువ అవగాహనతో కావాలనే మా పెన్షన్ లను తొలగించారు అన్న వాదనతో ప్రభుత్వాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. దీనికి తోడు టీడీపీ నాయకుల స్వరం కూడా తోడవడంతో ప్రజలు జగన్ ను ఉద్దేశిస్తూ తిడుతున్నారు. అయితే ఈ పరిస్థితిని తీక్షణంగా పరిశీలిస్తున్న ప్రభుత్వ అధికారులు.. విషయాన్ని సి జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనితో సీఎం జగన్ వెనువెంటనే కాసేపటి క్రితమే కీలక ప్రకటన చేశారు. జగన్ మాట్లాడుతూ మా ప్రభుత్వంలో ఏ పధకం అయినా అర్హులుగా ఉన్నవారికే మేము అందిస్తాం.. అదే విధంగా పెన్షన్ లను కూడా 100 శాతం అర్హులైన వారికి మాత్రం ఇస్తూ వస్తున్నాము.

ఇక అనర్హులైన వారిని లిస్ట్ నుండి తీసేస్తే తప్పు ఏమిటి అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు పెన్షన్ కు అర్హులైన  వారికి వెతికి మరీ అందచేస్తున్నప్పుడు , అర్హులు కానివారికి తీసివేయడం ఎలా తప్పు అవుతుంది అంటూ వాపోయారు. ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ చేయాలి.. అప్పడు ఎవరైనా అనర్హులని తెలిస్తే తీసివేసే అధికారం ఉంటుంది. వెరిఫికేషన్ చేస్తున్న మా అధికారులను... పెన్షన్ లు తీసేస్తున్నారని తప్ప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: