నాడ్ స్ట్రీమ్ 1, 2 పైపు లైన్ ద్వారా జర్మనీకి ఆయిల్ ను రష్యా సరఫరా చేసేది. క్రూడాయిల్ ధర 40 కే బ్యారెల్ ను అమ్మేది. దాన్ని జర్మనీ కొనుక్కుని 80, లేదా 90 డాలర్ల వరకు బ్యారెల్ ను అమ్ముకునేది. దీంతో జర్మనీ ఎక్కువగా లబ్ధి పొందేది. దీని ద్వారా ఆయిల్ ను శుద్ది చేసే పరిశ్రమలు, దాని అనుబంధ రంగ పరిశ్రమలతో ఎక్కువగా లబ్ధి పొందింది. అయితే జర్మనీ నాటో దేశం కాబట్టి అమెరికా తెలివిగా ఆ పైపులైన్ నే ధ్వంసం చేసింది. దీని వల్ల రష్యా ఆర్థికంగా నష్టపోవాలని భావించారు. కానీ జర్మనీ నాడ్ స్ట్రీమ్ పైపులైన్ ను జర్మనీని ధ్వంసం చేయాలని చెప్పినా అది చేయలేదు. దీంతో అమెరికానే దాన్ని ధ్వంసం చేసేసింది.


అయితే తర్వాత జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ కు ఎక్కువగా ఆయుధాలు ఇస్తోంది మాత్రం జర్మనీనే. దీనికి కారణం కూడా అమెరికానే. నాటో లో కీలక దేశం జర్మన్ దీని ద్వారా ఆయుధాలను ఉక్రెయిన్ కు ఇప్పించడంలో అమెరికా సక్సెస్ సాధించింది. అయితే రష్యా లో ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోలేదు. కానీ జర్మన్ మాత్రం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. లేటెస్ట్ గా చూస్తే 3 శాతం ఎకానమీ దెబ్బతింది. కరెంట్ కోతలతో పరిశ్రమ రంగం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.


కంటిన్యూగా ఈ విధంగా కోతలు ఉండటంతో అక్కడ పారిశ్రామిక రంగం పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇలా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు జర్మన్ ఆర్థిక వ్యవస్థ లాభాల బాటలో పయనిస్తూ ఇతర యూరప్ దేశాలకు ఆదర్శవంతంగా ఉండేది. ఇప్పుడు ఆయిల్ ను వేరే దేశాల నుంచి ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సి వస్తోంది. ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసినా కూడా అది సరిపోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: