సంక్షేమ పథకాల విషయంలో, వాటిని అమలు చేసే విషయంలో ఇప్పటివరకు చంద్రబాబు యాక్టివ్ గా లేరని అంటున్నారు రాజకీయ నిపుణులు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ వైపు నుండి వచ్చిన సంక్షేమ పథకాల గురించి చెప్పాల్సి వస్తే కేవలం తెలుగుదేశం నుండి  ఎన్టీఆర్ అమలు చేసిన కిలో రెండు రూపాయలు బియ్యం పథకం మాత్రమే తెలుగుదేశం ఖాతాలో ఉంది. అంటే చంద్రబాబు నాయుడు చేసిన హామీ పథకాలు ఏమీ లేవని తెలుస్తుంది. ఇప్పటివరకు ప్రకటించినవి కూడా సరిగ్గా అమలు చేయలేని పరిస్థితి అయింది. ఎన్టీఆర్ టైంలో ఐదేళ్లు అధికారంలో లేరు. చంద్రబాబు టైంలో పదేళ్లు అధికారంలో లేరు. ఇప్పుడు మరొక నాలుగేళ్లు మొత్తం కలుపుకుంటే 19 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోనే లేదు.


పరిపాలన విషయానికొస్తే తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో మొదటి ఒకటిన్నర ఏడాది, ఆ తర్వాత ఐదు ఏళ్ళు‌ అధికారంలో ఉన్నారు.  మళ్లీ ఆ తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలు అధికారంలో ఉన్నారు. అంటే టోటల్ గా ఎన్టీఆర్ అధికారంలో ఉంది ఆరున్నర ఏళ్ళు అని తెలుస్తుంది. మొత్తంగా కలుపుకొని ఏడేళ్లు ఎన్టీఆర్ అధికారంలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 9 ఏళ్ళు ఇంకా ఐదేళ్లు మొత్తం కలిపి 14 ఏళ్ళు. ఇలా ఎన్టీఆర్ ఇంకా చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి ఇప్పటివరకు 21 ఏళ్లు పరిపాలన కొనసాగించారని తెలుస్తుంది.


కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకంలో నుండి కొన్నింటిని, అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇవన్నీ సేకరించి వీటి నుండి తెలుగుదేశం మరో సరికొత్త మేనిఫెస్టోను విడుదల చేసింది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు వరకు జగన్ అమలు చేస్తున్న హామీ పథకాల తరఫునుండి సంవత్సరానికి 54000వస్తే, తెలుగుదేశం నుండి  1,07,600 వస్తాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: