కాంగ్రెస్ పార్టీ బీజేపీని దంచికొడుతోందా ? రాజకీయ విశ్లేషకుల లెక్కల ప్రకారం అవుననే చెప్పాలి. ఎలాగంటే కర్నాటక ఎన్నికలకు ముందునుండి సోషల్ మీడియాలో బీజేపీని కాంగ్రెస్ ఉతికి ఆరేస్తోందట. కొంతకాలంగా రాజకీయపార్టీలన్నీ సోషల్ మీడియాను వేదికగా చేసుకునే ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. పార్టీల అధినేతలు, అగ్రనేతలు ఎన్ని బహిరంగసభల్లో ప్రసంగించారు, ఎన్ని రోడ్డుషోల్లో పాల్గొన్నారన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోవటంలేదు.
మొత్తం వ్యవహారమంతా సోషల్ మీడియా చుట్టే తిరుగుతోంది. తెల్లవారి లేచిన దగ్గర నుండి జనాలు కూడా రాత్రి నిద్రపోయేంతవరకు మొబైల్ ఫోన్ను అంటిపెట్టుకునే ఉంటున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగిపోవటంతో జనాల్లో అత్యధికులు సోషల్ మీడియాను విపరీతంగా కనెక్టవుతున్నారు. ఇన్ స్టా గ్రామ్, వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి ఫ్లాట్ ఫాంలను జనాలు ఎక్కువగా ఫాలో అవుతున్నారు.
కారణాలు ఏమిటో స్పష్టంగా తెలీదు కానీ కర్నాటక ఎన్నికలకు ముందే బీజేపీ సోషల్ మీడియా ప్రచారంలో బాగా వెనకబడిపోయింది. బీజేపీ వెనకబడిపోతే ఇదే అదునుగా కాంగ్రెస్ రెచ్చిపోయింది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం ముందు బీజేపీ నిలవలేకపోయింది. చివరకు ఎన్నికల ఫలితాలు ఎలాగొచ్చాయో అందరు చూసిందే. ఇపుడు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఇదే ట్రెండ్ కనిసిస్తోంది. అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా గ్రూపులు దుమ్ముదులిపేస్తోంది. నరేంద్రమోడీ, అమిత్ షా ను సమాజంలో చిచ్చుపెట్టి విభజించు పాలించు పద్దతిలో దేశాన్ని పాలిస్తున్నట్లు కాంగ్రెస్ రూపొందించిన 1.43 నిముషాల క్యారికేచర్ వీడియో ట్విట్టర్ లో ట్రెడిండ్ గా మారింది.
ఇందులో మోడీ, షా లు జనాల మధ్య చిచ్చుపెడుతుంటే రాహుల్ గాంధి జనాలందరినీ దగ్గరకు తీసుకుని ఏకంచేస్తున్నట్లుంది. మోడీ, షా సమాజంలో విధ్వేషాన్ని నింపుతుంటే రాహుల్ ప్రేమను పంచుతున్నట్లుగా చూపించారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఏబీపీ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో కాంగ్రెస్ దే పై చేయిగా కనిపిస్తోంది. చత్తీస్ ఘర్, రాజస్ధాన్లో అధికారాన్ని నిలుపుకోవటంతో పాటు మధ్యప్రదేశ్, తెలంగాణాలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోవటం ఖాయమనే అనుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి