అయితే రష్యా వ్యాగనర్ చీప్ మధ్య కుదిరిన సయోధ్య వల్లే ఇది సాధ్యమైందని తెలుస్తోంది. జూన్ 24 వ తేదీన తిరుగుబాటు ప్రారంభించారు. అయితే దీన్ని 36 గంటల్లోనే పుతిన్ లేకుండా చేయగలిగారు. వ్యాగనర్ చివరకు బెలారస్ లో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఎవరైతే తిరుగుబాటు చేశారో అతనితో రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ తిరుగుబాటు వెనక పెద్ద ప్లాన్ ఉన్నట్లు మేధావులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ తనను కాపాడుకోవడం మానేసి రష్యా లోని భూభాగాలపై దాడులు చేస్తున్న తరుణంలో దాని నుంచి దారి మళ్లించేందుకు పుతిన్ ఆడిన నాటకం అని అంటున్నారు.
పుతిన్ అసలే చాలా కోపిష్టి అలాంటిది దేశంపై తిరుగుబాటు చేయడానికి వచ్చిన వ్యక్తితో కలిసి కూర్చొని చర్చించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కాబట్టి ఇదంతా పక్కా ప్లాన్ తోనే జరిగిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ బెల్ గ్రెడ్ పై చేస్తున్న దాడులు.. దాని ఎటాకింగ్ ను దెబ్బతీసి తర్వాత ఉక్రెయిన్ పై విరుచుకుపడాలని ప్లాన్ వేసినట్లు అనుకుంటున్నారు.
అయితే పుతిన్.. వ్యాగనర్ తో చర్చలు జరిపాడంటేనే నమ్మశక్యంగా లేదని చాలా మంది నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే రష్యాలో తిరుగుబాటు మొదలైందో ఆ క్షణంలో ఉక్రెయిన్ రష్యాపై దాడులను ఆపేసింది. దీంతో రష్యా రివర్స్ ఎటాకింగ్ కు దిగి ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలను ధ్వంసం చేసేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి