పాకిస్థాన్ లో ఒక విచిత్ర సంక్షోభం నెలకొంది. సాధారణంగా ఎవరైనా అధికారంలో ఉన్న క్యాండిడేట్ రాజీనామా చేస్తే రెండు నెలల పాటు అపద్దర్మ ప్రభుత్వంగా ఉంటారు. అయితే రెండు మూడు నెలల తర్వాత ఎన్నికలు జరగాలి. కానీ అపద్దర్మ ప్రభుత్వం మేం చేయలేము అన్నప్పుడు వేరే వాళ్లను మూడు నెలలు అధికారంలో పెడతారు. అయితే పాకిస్థాన్ లో సెప్టెంబర్ లో ఎన్నికలు ఉండగా రాజీనామా చేస్తామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ అన్నారు.


పార్టీ పత్రిక అయిన డాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీనామా గురించి ప్రస్తావించారు. రాజీనామా అనంతరం మూడు నెలల పాటు అపద్ధర్మ పీఎంగా ఉండొచ్చు. అదే సమయంలో తమ పార్టీ సీనియర్ నాయకుడు నవాజ్ షరీఫ్ ను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నవాజ్ షరీఫ్ పై కేసులు ఉన్నాయి. ఆయన శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అని కోర్టులో ఇచ్చిన తీర్పులు ఉన్నాయి.


కోర్టు తీర్పుల ప్రకారం.. నవాజ్ షరీఫ్ ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు. కానీ పాక్ ప్రభుత్వం చట్టంలో సవరణ చేసింది. ఎవరికైనా జీవిత కాలం నిషేధం అనే పదాన్ని ఎత్తివేసింది. ఎవరైనా ఎన్నికల్లో నిలబడకుండా అయిదేళ్లు మాత్రమే నిషేధం అని చట్ట సవరణ చేసింది. దీని వెనక నవాజ్ షరీఫ్ ను వచ్చే ఎన్నికల్లో రంగంలో దించేందుకు చేసిన ప్రయత్నం అని తెలుస్తోంది.


షెహబాజ్ షరీఫ్ కాకుండా నవాజ్ షరీఫ్ కు ప్రజల్లో చాలా క్రేజ్ ఉంది. దాన్ని అనుకూలంగా మార్చుకుని వచ్చే మూడు నెలల్లో నవాజ్ షరీఫ్ ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని షెహబాజ్ షరీఫ్ భావిస్తున్నారు. మరి నవాజ్ షరీఫ్ పాక్ కు తిరిగి ఎప్పుడొచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు సజావుగా జరుగుతాయా? ఎన్నికల్లో నవాజ్ పోటీ చేస్తాడా.. గెలిచే అవకాశం ఉందా అనేది కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: