తెలంగాణలో రైతు బంధు వేయకుండా ఈసీ అనుమతులు నిరాకరించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పథకం ఇవ్వాలన్న ఈసీ అనుమతి తీసుకోవాలి. కానీ రైతు బంధు ఈ విడత నిధులను తెలంగాణ రాష్ట్ర సర్కారు లేట్ చేసింది. దీంతో ఎన్నికలు నవంబర్ 30 న జరగనుండగా తాము రైతులకు వేయాల్సిన రైతు బంధు నిధులను వేసేలా అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను కోరింది. దీంతో ఎన్నికల కమిషన్ అనుమతులు మంజూరు చేసింది.


కానీ కొన్ని షరతులు విధించింది. ఎక్కడా కూడా దాని గురించి ప్రచారం చేయరాదని కండిషన్ పెట్టింది. అలా ప్రచారం చేస్తే అనుమతులు రద్దు చేస్తామని ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఎన్నికల సమయంలో రైతు బంధు ఇవ్వొద్దని ఈసీకి కంప్లైంట్ చేసినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయితేే అలా మేం ఎక్కడా కూడా కంప్లైంట్ ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రతి విమర్శలు చేసింది.


అయితే నవంబర్ 26 న మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం చాయ్ తాగే లోపు మీ మొబైల్ ఫోన్లలో టింగ్ టింగ్ మని చప్పుడుతో రైతు బంధు డబ్బులు పడతాయని అన్నారు. ప్రతి పక్షాలు ఆపాలని చూసిన ఎన్నికల కమిషన్ పెద్ద మనసుతో ఒప్పుకుందని మాట్లాడారు. దీన్ని కాంగ్రెస్ నేతలు ఈసీ దృష్టికి తీసుకుపోయారు. ఈసీ పెట్టిన కండిషన్ ప్రకారం రైతు బంధు డబ్బుల గురించి ఏ ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడరాదు.


కానీ హరీశ్ రావు మాట్లాడటంతో ఈసీ రైతు బంధు డబ్బులు వేయరాదని అనుమతి నిరాకరించింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కాంగ్రెస్ వల్లే రైతు బంధు డబ్బులు రాలేదని బీఆర్ఎస్ అంటుంటే.. బీఆర్ ఎస్  కావాలనే లేట్ చేసి ఇప్పడు కాంగ్రెస్ పై నిందలు వేస్తుందని మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: