కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ అత్యవసరం. ఎందుకంటే జన ఆకర్షణ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను తెలుగుదేశం పార్టీ తనతో నడుపుకుంటుంది. ఇప్పుడు నారా లోకేష్ కు సంబంధించి భోగాపురంలో జరిగిన సభకు కూడా ఈ జనాకర్షణ కోసమే పవన్ ని పిలవడం జరిగిందట. అయితే మొదట తాను రాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పిలవడంతో ఓకే చెప్పారని తెలుస్తుంది.
అయితే పవన్ కళ్యాణ్ తన శ్రేణులకు మనతో తెలుగుదేశం పార్టీ కలిసి సాగుతుంది కాబట్టి టీడీపీ పై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని అన్నారట. అయితే నారా లోకేష్ పాదయాత్ర, ఇంకా బహిరంగ సభ సందర్భంగా ఇచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. ఇంతకీ ఎందుకు చర్చ అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ 2 సమాన స్థాయిల్లో ముందుకు వెళుతున్నాయి.
అలాంటి సందర్భంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఫోటోలను హైలెట్ చేస్తూ అలాగే పవన్ కళ్యాణ్ ఇంకా బాలకృష్ణ ఫొటోస్ లను సైడ్ యాక్టర్లుగా ఈ అడ్వర్టైజ్మెంట్ లో ప్రచురించడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ కు సమ స్థానం అనేది చంద్రబాబునాయుడు ఎక్కడ ఇస్తున్నారు అంటూ కొంతమంది ఈ సందర్భంగా అడుగుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి