సోనియాగాంధి కుటుంబాన్ని కేసులు వెంటాడుతున్నాయి. మొన్నటివరకు సోనియాగాంధి, రాహుల్ గాంధిపైన మాత్రమే మనీల్యాండరింగ్ కేసులు నమోదై విచారణ జరిగాయి. తాజాగా ప్రియాంకగాంధి పేరును కూడా మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో ఈడీ చేర్చటం హాట్ టాపిక్ అయ్యింది. మనీ ల్యాండరింగ్ కేసులో ప్రియాంక పేరును చేర్చటం ద్వారా ఈడీ ఆమెకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి.





ఫరీదాబాద్ లో 2006లో జరిగిన రెండు లావాదేవీల ఆధారంగా మనీల్యాండరింగ్ లో ప్రియాంక పేరును ఈడీ చేర్చింది. ఫరీదాబాద్ లో అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ ఎల్ పహ్వా ద్వారా ప్రియాంక భర్త రాబర్ట్ వాధ్రా 40 ఎకరాల భూమిని కొన్నారు. అయితే నాలుగేళ్ళ తర్వాత అంటే 2010లో అదే భూమిని తిరిగి పహ్వాకే అమ్మేశారు. అలాగే 2006లోనే అమీపూర్ గ్రామంలోనే అదే ఏజెంట్ పహ్వా ద్వారా ప్రియాంక ఒక ఇంటిని కొన్నారు. ఆ ఇంటిని  కూడా 2010లో ప్రియాంక తిరిగి అదే ఏజెంట్ పహ్వాకు అమ్మేశారు.





అంటే భార్య, భర్తలు ఇద్దరు కూడా అమీపూర్ గ్రామంలో భూమిని, ఇంటిని రియల్ ఎస్టేట్ ఏజెంట్ పహ్వా ద్వారానే కొనుగోలు చేసి తిరిగి 2010లో అదే ఏజెంట్ పహ్వాకు తిరిగి అమ్మేయటమే విచిత్రంగా ఉంది. అసలు ఎందుకు కొన్నారు ? ఎందుకు అమ్మేశారన్నది అర్ధంకావటంలేదు. పైగా జరిగిన రెండు లావాదేవీలు కూడా పహ్వా ద్వారానే జరగటం గమనార్హం.





ఈ లావాదేవీల ఖర్చులు మొత్తం విదేశాల నుండే డబ్బు అందినట్లు ఈడీ నిర్ధారించింది. యూఏఈకి చెందిన సీసీ థంపీ, సుమిత్ చద్దా ద్వారానే ప్రియాంక, రాబర్ట్ కు డబ్బులు అందినట్లు ఈడీ గట్టిగా చెబుతోంది. రాబర్ట్ వాద్రాతో పాటు సంజయ్ బండారి సన్నిహితులు  సుమిత్ చద్దా, థంపి పై కోర్టులో ఈడీ చార్జిషీట్ దాఖలుచేసింది. ఇప్పటికే సంజయ్ బండారికి చెందిన రు. 26 కోట్లను ఈడీ జప్తుకూడా చేసింది. చార్జిషీట్లలో నలుగురి పేర్లలో ప్రియాంక భర్త రాబర్ట్ పేరుంది. అయితే ప్రియాండ పేరు మాత్రం లేదు. కానీ మనీల్యాండరింగ్ లో మాత్రం ప్రియాంక పేరు ప్రస్తావించటం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: