2014లో భారత దేశ బడ్జెట్ రూ.14లక్షల కోట్లు.  ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన పదేళ్ల తర్వాత ఇప్పుడు భారత బడ్జెట్ రూ.47లక్షల కోట్లు. ఈ ఉదాహరణ చాలదా ప్రధానిగా మోదీ సాధించిన ఘనత చెప్పడానికి. గుడులు, విగ్రహాలు కట్టడం తప్ప మోదీ ఏం సాధించారు అని కొందరు విమర్శిస్తుంటారు. వాళ్లందరికీ ఈ లెక్కలు చూపిస్తే చాలు అని బీజేపీ నేతలు చెబుతున్నారు.


రెవెన్యూ వసూళ్లు అంటే వివిధ రకాల పన్నుల రూపంలో వచ్చే ఆదాయం రూ.సుమారు 30లక్షల కోట్లు. గతంలో బడ్జెట్ రూ.14లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు రెవెన్యూ వసూళ్లే రూ.30లక్షల కోట్లు. అరవై ఏడేళ్లలో రూ.14లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఈ పదేళ్ల కాలానికి సంబంధించింది ప్రస్తుత బడ్జెట్. అంటే మన దేశం అభివృద్ధి చెందుతున్నట్లా లేక.. చెందనట్లా అని ప్రశ్నిస్తున్నారు. పన్నులు విపరీతంగా వసూలు చేస్తున్నారు అంటే గతంలో ధనికులందర్నీ వదిలేసినట్లా అనే ప్రశ్నలు తలెత్తక మానదు.


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అభివృద్ధి చెందిన భారతదేశ పునాదిని బలోపేతం చేసే దిశగా ఒక గ్యారంటీ బడ్జెట్ లా నిలిచిందని ప్రధని నరేంద్ర మోదీ అన్నారు. ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించేలా ఉందన్నారు.  పేదలు, మధ్యతరగతి ప్రజల కోసం 4 కోట్ల ఇళ్లు కట్టించామని.. మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.


దీంతో పాటు మహిళల్లో రెండు కోట్ల మందిని లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇప్పుడు ఈ లక్ష్యం మూడు కోట్లకు పెంచామన్నారు. పేదలందరికీ ఉచిత వైద్యం ఆయుష్మాన్ భారత్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దీంతో కోటి కుటుంబాలకు సోలార్ రూట్ టాఫ్ ను ఉచితంగా అందజేస్తామని దీనిని వినియోగించగా మిగిలిన దాన్ని అమ్మడం ద్వారా ఏటా రూ.15నుంచి రూ.18వేల ఆదాయం పొందేందుకు అవకాశం ఉందన్నారు. ఇవన్నీ మోదీ తెచ్చిన మార్పుగా బీజేపీ నేతలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: