రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఉపాసన తమిళ హీరో విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ పైన ఆమె మాట్లాడుతూ.. ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న ఆయన ఇప్పుడు ప్రజల సేవ చేయాలనుకుంటున్నారు.. ఇది చాలా గొప్ప విషయం ఈ విషయంలో నేను ప్రతి ఒక్కరికి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను.. మీకు మార్పు కావాలి అనుకున్నప్పుడు లీడర్ ఎవరు అని చూడకూడదు వారికి కచ్చితంగా సపోర్ట్ చేయండి.. ఒకవేళ అలా సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు.. తనని మాత్రం వెనక్కి లాగకండి అంటూ తెలియజేసింది ఉపాసన.
ఒక కొత్త నాయకుడిని సపోర్ట్ చేస్తున్నప్పుడే మార్పు అనేది కూడా వస్తుంది.. ఈ మార్పు తమిళనాడులో కూడా వస్తుందని భావిస్తున్నాను అంటూ తెలిపింది ఉపాసన.మెగా ఫ్యామిలీ అంతా కూడా పొలిటికల్ పరంగా కాస్త యాక్టివ్గానే కనిపిస్తున్నారు..ఒకప్పుడు చిరంజీవి రాజకీయాలలో ఉన్నప్పటికీ వాటి నుంచి వైదొలిగారు ఇప్పుడు నాగబాబు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా సాగుతున్నారు.. చిరంజీవి మాత్రం ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ సినిమాలను చేస్తూ ఉన్నారు. తాజాగా ఉపాసన పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందా అనే విషయంపై ప్రశ్నించగా ఆమె రాజకీయాలలోకి రావడం అనేది మాత్రం జరగదని కానీ.. మార్పు తీసుకువచ్చే ప్రతి నాయకుడికి కూడా తన సపోర్టు ఉంటుందని ఉపాసన తెలియజేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి