జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున ఒక ప్రకటనను చేయడం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది .అదేమిటంటే పార్టీ బలోపేతం కోసం ఎన్నికల నిర్వహణ ఖర్చు కోసం తానే స్వయంగా రూ.10 కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన ప్రకటన పైన అభిమానులు అయితే కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.. పార్టీ కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టి నాయకుడు మా నాయకుడే అంటే తెగ ప్రచారం చేస్తున్నారు జనసైనికులు. మరి కొంతమంది మాత్రం ఈసారి చాలామంది జన సైనికులు తమ జేబులకే చిల్లు పడతాయంటూ ఆందోళన పడుతున్నారు.అయితే ఇదంతా కేవలం మాట పూర్వకంగానే చెప్పారని ఇప్పటివరకు అలా డబ్బులు ఇచ్చిన తాకలాలు ఎక్కడ కనిపించలేదంటూ జనసేన నేతలు కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇటీవలే ప్రకటనలు చేయడం ఆ తర్వాత వాటి గురించి మర్చిపోవడం చాలా అలవాటుగా మారిపోయింది.పవన్ ప్రకటించిన 10 కోట్ల రూపాయల విరాళం వెనుక కూడా ఏదైనా కిటుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అభిమానించే వారిని పక్కన పెడితే రాజకీయాలలో ఆయనకు భజన చేసే వారికి ఎక్కువగా ధన దాహం ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.


సాధారణంగా ఏదైనా సినిమా ప్లాప్ అయితే ఏ హీరో అయినా తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటారు లేదా తీసుకున్న వాటిలో కొంచమైన తిరిగి ఇస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా ఎప్పుడూ చేయరు వరుసగా సినిమాలు ఫ్లాప్ లైన తన రెమ్యూనరేషన్ మాత్రం తగ్గించుకోరు. ఒక చిత్రానికి 50 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు స్వయంగానే తెలియజేశారు. ఇంతటి డబ్బులు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ తన కారుకు ఈఎంఐ కట్టడానికి తన స్టాఫ్ కు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెబుతూ ప్రజలలో సానుభూతి పొందాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గత మూడేళ్ల పవన్ కళ్యాణ్..హరిహర వీరమల్లు, బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి వంటి సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.


ఒక సినిమాకి రూ.50 కోట్లు వేసుకున్న కనీసం రూ.250 కోట్ల రూపాయల వరకు తీసుకున్నారు.. అయినప్పటికీ కూడా తాను పేదవాడినే అంటూ తన దగ్గర డబ్బులు లేవంటూ తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా టిడిపి తో పొత్తు కలవడం పైన కూడా ప్యాకేజీ స్టార్ అనే పేరు కూడా అందుకున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా అన్నిటినీ కూడా చంద్రబాబు దగ్గరుండి చూసుకుంటున్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి.. మరి రూ.10 కోట్ల విరాళం పైన క్లారిటీ ఇస్తారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: