ఏపీలో రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో టిడిపి తో పాటు జనసేన పార్టీ పొత్తులతో ప్రకటించి ముందుకు వెళ్లాలని చూస్తోంది . ఆ విధంగానే అడుగులు వేస్తూ ఉన్నారు. గడిచిన రెండు రోజుల క్రితం అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు అలాగే మరొకవైపు బిజెపితో కూడా టిడిపి పొత్తు పెట్టుకుని మరి ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు రకాల బహిరంగ సభలలో రాబోతున్న ఎన్నికలలో తాను ఓడిపోయిన పరవాలేదు కానీ వైయస్ జగన్ మాత్రం అధికారంలోకి రాకూడదని ఎన్నోసార్లు తెలియజేశారు. అందుకే తాను టిడిపి తో పొత్తు పెట్టుకున్నానని కూడా తెలిపారు.


దీర్థ ప్రజా సేవ చేయడానికి రాజకీయాలలోకి వచ్చారా లేకపోతే జగన్ ఓడించడానికి వచ్చారా తాను అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచి గురించి కూడా ఎక్కడ మాట్లాడకుండా కేవలం జగన్ని ఓడించడం గురించి మాట్లాడుతూ ఉండడంతో చాలామంది ఈ విషయాన్ని గమనించాలి అంటూ ప్రశ్నిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ విషయాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంలో అలా మాట్లాడారో తెలియదు కానీ ఆ మాటలలో మరొక ఉద్దేశం కూడా ఉంటుంది అంటే తెలుపుతున్నారు



ముఖ్యంగా మ్యానిఫెస్టో కూడా విడుదల చేయలేని జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసం ఏం చేస్తుందో తెలియాలి అంటూ కూడా పలువురు నేతలు ప్రజలు కూడా అడుగుతున్నారు. 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోలోని 99% పనులను పూర్తి చేశాననే విధంగా కూడా తెలియజేస్తున్నారు.. ఈసారి కూడా మరింత పగడ్బందీగా మ్యానిఫెస్టోను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఏపీ సీఎం.. టిడిపి కూడా గడచిన కొద్ది రోజుల క్రితం 6 గ్యారెంటీలు అనే పథకంతో ముందుకు వెళ్లిన కూడా ఆ మేనిఫెస్టోను ఎవరు పట్టించుకోలేదు. దీంతో ఈ విషయాన్ని గమనించిన టిడిపి జనసేన ఈసారి పొత్తులో భాగంగా మేనిఫెస్టోను విడుదల చేస్తామంటూ తెలిపారు. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడానికి కారణం ఏంటి ప్రజాసేవన లేకపోతే సీఎం జగన్ ఓడించడమా అనే విషయం పైన జనసైనికులకు అర్థం కావడం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: