ఏలూరులోని నిన్నటి రోజున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన చేశారు.. ముఖ్యంగా నరసాపురం, ఏలూరు ,కాకినాడ, రాజమండ్రి, అమలాపురం వంటి పార్లమెంట్ బూతు వద్ద బిజెపి కార్యకర్తల సమ్మేళనలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలను ఉత్సాహం చేసే విధంగా తెలియజేశారు. కార్యకర్తలు ఉత్సాహం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఏపీలో కూడా బిజెపి అధికారంలోకి వస్తుందని చాలా నమ్మకం కలుగుతుందనే విధంగా మాట్లాడారు.. పోలవరం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచనలు ఇక్కడ ప్రభుత్వాలు లేవంటూ కూడా ఆరోపిస్తున్నారు.


పోలవరం ప్రాజెక్టు మోడీ చేతులలోనే తీసుకొని పూర్తి చేస్తామంటూ కూడా వెల్లడించారు రాజ్నాథ్ సింగ్.. పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నప్పటికీ అభివృద్ధి ఇంకా జరగలేదని.. మైనింగ్ మాఫియా మద్యం మాఫియా రాష్ట్రాన్ని దోచేశారంటూ తెలియజేశారు.. తెలుగు బిడ్డ అయినటువంటి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి బిజెపి వారి యొక్క గౌరవాన్ని పెంచిందంటూ వెల్లడించారు. కేంద్రం నుంచి జలజీవన్ నిధులను కూడా రాష్ట్రానికి ఇస్తున్నప్పటికీ ఇంకా కొన్నిచోట్ల మంచినీళ్లు దొరకడం చాలా కష్టంగా మారుతోంది అంటూ రాజ్నాథ్ సింగ్ తెలిపారు.


దేశం పేరు చెబితే గతంలో ఎవరు పట్టించుకునేవారు కాదని ఇప్పుడు మోడీ పేరు చెబితే ప్రపంచ దేశాలన్నీ కూడా అలర్టుగా మారుతున్నాయని రాజునాథ్ సింగ్ వెల్లడించారు.. గత ప్రభుత్వాలపైన అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయని బిజెపి పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవంటూ ఆయన వెల్లడించారు మూడవసారి బిజెపి 370 కి పైగా సీట్లు సాధిస్తాయంటూ తెలియజేశారు. ఏపీలో కూడా నియోజకవర్గాలలో అన్నిచోట కూడా తమ పార్టీ నేతలు నిలబడే విధంగా సన్నహాలు జరుగుతున్నాయి అనే విధంగా తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తే టిడిపి జనసేనతో పొత్తు లేనట్టే అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: