ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది ముఖ్యంగా ఎవరి ప్రచార వ్యూహాలను వారు పాటిస్తూ ముందుకు వెళుతున్నారు. అయితే ఈసారి టిడిపి జనసేన కూటమిగా పోటీ చేయబోతున్నాయి.. నిన్నటి రోజున తాడేపల్లిగూడెంలో టిడిపి జనసేన ఉమ్మడి సభ అయినటువంటి తెలుగు జన విజయకేతగా జండా సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ మాటలు రెండు రాష్ట్రలను హీటెక్కించేలా కనిపిస్తున్నాయి. ఎప్పుడు లేనంతగా సభలో పవన్ కళ్యాణ్ గంభీరంగా ఎమోషనల్ గా మాట్లాడారు..


అధికారపక్షం పైన పవన్ కళ్యాణ్ ఎక్కువగా విమర్శలు వ్యంగాస్త్రాలు కూడా చేశారు.. వీరితో పాటు సొంత అభిమానులే తనను మాటలు అంటున్న వాటికి కూడా సమాధానాలను ఇచ్చారు. ప్రజల సమస్య కోసం తాను కోట్ల రూపాయలను వదిలేసి రాజకీయాలలోకి వస్తే తనని రెండు చోట్ల కూడా ఓడించారని అభిమానులను చెబుతూనే తనకు ఓటు వేయలేదు అంటూ తన బాధను వ్యక్తం చేశారు.. తన అభిమానులమనీ చెబుతూ నన్ను కాదని మీరు జగన్ కి ఓటు వేశారు.. మర్చిపోని ఈరోజు మీరు ఎంత సఫర్ అవుతున్నారు.. నేను కాదు మీ భవిష్యత్తు కోసం నేను రోడ్ల మీదికి వచ్చాను అంటూ తెలియజేశారు.


కోట్లు సంపాదించే మార్గాలు నా దగ్గర చాలానే ఉన్నాయి అవన్నీ కాదనుకొని వచ్చాను అంటే నా మనసులు మనవాళ్లే అని తప్పన పడి వచ్చానని వెల్లడించారు ఓడిపోయానని బాధ లేదు నిలబడ్డాను రెండు చోట్ల ఓటమి చాలా బాధని ఇచ్చింది.. నేను నిరాశ తో మళ్లీ మీ ముందుకు వస్తున్నాను ఒకటే గుర్తుపెట్టుకున్న దక్షిణాఫ్రికాలో ట్రైన్ లో నుంచి గెంటయ్యబడ్డ గాంధీ కారు కూడా గుర్తుకువచ్చారు.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని పార్టీని నడపలేదు అవమానాలతో ముందుకు వెళ్లారని తెలిపారు.. అభిమానులు ఎవరు నాకు ఓటు వేయకపోయినా నాకేం నష్టం ఉండదు అంటూ కూడా తెలియజేశారు.ప్రస్తుతం ఈ విషయాలు మాత్రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి రాజకీయాల్లో..

మరింత సమాచారం తెలుసుకోండి: