రాజకీయాలలో చదరంగం ఆట ఆడాలంటే అంత ఈజీ కాదు.. ప్రత్యర్థి ఎలాంటి వ్యూహాలను రచిస్తున్నారనే విషయాన్ని ముందుగానే పసికడుతూ అందుకు తగ్గట్టుగా అడుగులు ముందుకు వేయాలి లేకపోతే రాజకీయ భవిష్యత్తు సైతం ప్రశ్నార్థకంగానే ఉంటుంది.. ప్రత్యర్ధుల ఎన్నో వ్యూహాలను పండిన ఎలాంటి వ్యాఖ్యలతో రెచ్చగొట్టినా కూడా వాటన్నిటికీ ప్రతిస్పందన ఇస్తూనే రాజకీయాలలో నిలదొక్కుతూ ఉండాలి. ఓటమి భయంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడితే కచ్చితంగా ప్రజలలో నవ్వుల పాలవుతూ ఉంటారు.. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు..


గడిచిన రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ స్పీచ్ చూసిన వాళ్లంతా కూడా పవన్ కు జగన్ భయం పట్టుకుందని అనుమానాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ తెలియజేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ తన పార్టీని స్థాపించి దాదాపుగా పదేళ్లు పైగా అవుతున్న ఇప్పటివరకు తన పార్టీని బలోపేతం మాత్రం చేసుకోలేదు.. ప్రతి ఎన్నికలకు కూడా ఏదో ఒక విచిత్రమైన వ్యూహంతో వచ్చి అటు అభిమానులను , జనసేన కార్యకర్తలను నవ్వుల పాలయ్యేలా చేస్తున్నారు.. 2014లో టిడిపికి మద్దతు ఇవ్వగా 2019లో ఒంటరిగా పోటీ చేయక మళ్లీ 2024లో టిడిపి తో కలిసి పోటీ చేయబోతున్నారు.


ఇలా చిత్ర విచిత్రంగా తన పార్టీతో ప్రవర్తించడానికి ముఖ్య కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న భయం అనే టాక్ క్లారిటీగా వినిపిస్తోంది.. 2019లో పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం అసెంబ్లీ స్థానాలలో నిలుచోగా రెండు చోట్ల కూడా చాలా ఘోరంగా ఓడిపోయారు.. 2019లో జగన్ సునామీలో పవన్ కొట్టుకుపోయారని చెప్పవచ్చు.. ఆ సమయం మంచి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కోలుకోలేకపోతున్నారు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయాలో అర్థం కాక చాలా సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.. చంద్రబాబు బాలకృష్ణ లోకేష్ ఇతరత్రా నాయకులందరూ కూడా ఎక్కడ నిలబడాలో స్పష్టంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ పేరు మాత్రం ఇంకా ప్రకటించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: