ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన వాటిని సాధించేందుకు మరోసారి కేంద్ర పెద్దల వద్ద చర్చలు జరిపి నిధులు వీలైనంత వరకూ తీసుకుని వచ్చేందుకు ఎన్నికల ముందు జగన్ చేసే చివరి ప్రయత్నం అని అంటున్నారు.జగన్ ఢిల్లీ టూర్ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ఖరారు చేశాయి. సీఎం జగన్ ఢిల్లీ టూర్ లో ఎవరెవరిని కలుస్తారు అన్నది కూడా ఆసక్తికరమైన చర్చగానే ఉంది. ఆయన మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుస్తారు అని అంటున్నారు.ఈసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలుస్తారని అంటున్నారు. ఈ ఇద్దరితో జగన్ మోహన్ రెడ్డి కేవలం అఫీషియల్ భేటీలే వేయరని పొలిటికల్ గా కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.ఇక ఆంధ్రప్రదేశ్ లో చూస్తే పొత్తుల కధ ఇంకా కొలిక్కి రాలేదు, బీజేపీ టీడీపీల మధ్య చర్చలు సాగుతూనే ఉన్నాయి. మార్చి నెల మొదటి వారంలో రావచ్చు అన్నది ఒక మాటగా ఉంది. ఈ నేపధ్యంలో సడెన్ గా సీఎం జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడంతో ప్రతిపక్ష శిబిరం కూడా అలెర్ట్ అయి ఏమి జరుగుతోంది అని చూస్తోంది.కేంద్రంలోని బీజేపీ  అటు వైసీపీతోనూ ఇటు టీడీపీతోనూ గుడ్ రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తోందని అంటున్నారు. సేఫ్ గేమ్ కమలనాధులు ఆడుతున్నారని అంటున్నారు.


సీఎం జగన్ కోరినప్పుడల్లా కేంద్ర పెద్దలు ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఇంకా అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత నెల మొదటి వారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపిన వెంటనే జగన్ మోహన్ రెడ్డిని పిలిపించుకుని మరీ చర్చలు జరిపారు.అయితే దీని భావం తెలియక విపక్ష శిబిరం కూడా అయోమయానికి గురి అవుతోంది. ఇపుడు మళ్ళీ కూటమి కట్టే చివరి దశలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఎందుకు అన్నది రాజకీయంగా వినిపిస్తున్న మాట. ఇక ఇంకో వైపు చూస్తే కూటమిలో బీజేపీ చేరినా వైసీపీని దూరం చేసుకోదు అన్న మాట కూడా బలంగా ఉంది.ఏది ఏమైనా మరి కొద్ది రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ అనేది వస్తోంది. ఈ నేపధ్యంలో సీఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అన్నది మాత్రం పూర్తి సస్పెన్స్ గానే ఉంది. పైగా రాజకీయంగా ఇది విపరీతమైన చర్చకు కూడా తావు ఇస్తోంది. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ తరువాతనో ముందో పొత్తులు కుదురుతాయని అంటున్నారు.ఇక మొత్తానికి చూస్తే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ తరువాత ఏపీ పాలిటిక్స్ లో మరిన్ని సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: