తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. జనసేన నేత పవన్ కళ్యాణ్ విద్యాసంస్థలలో పలు రకాల సంస్కారాలను వ్యతిరేకిస్తున్నామంటూ నిన్నటి రోజున వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మండిపడ్డారు.. చంద్రబాబు నాయుడు ఒకవేళ మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాల సంస్కరణ కూడా ఆగిపోతుందంటూ ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనలు విడుదల చేస్తూ తెలియజేయడం జరిగింది.. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు వారి యొక్క చదువులు సంక్షేమం గురించి మంచి చేస్తుంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడే అవకాశం ఉందంటూ కూడా వెల్లడించారు.


చదువు పట్ల విప్లవతవ్యమైన మార్పులు తీసుకురాకపోతే కూలి పిల్లలు కూలిగానే మిగిలిపోతారు చంద్రబాబు, పవన్ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ నేర్చుకొని పై చదువుల కోసం విదేశాలకు వెళుతూ ఉంటే పేద పిల్లలు మాత్రం విద్య నేర్చుకోకూడదంటున్నారని తెలియజేశారు సీఎం.. పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకోనివ్వకుండా చంద్రబాబు అండ్ కో మన పైన యుద్ధం చేస్తున్నారని ఆయన పెంపుడు కొడుకు పవన్ కళ్యాణ్ వారి స్నేహపూర్వక మీడియా కూడా పలు రకాల దుష్ప్రచారాలను చేస్తున్నారంటూ తెలియజేశారు.


చంద్రబాబు దర్శినికథ నారాయణ, చైతన్య విద్యాసంస్థలతో జతకట్టి మేము నాయుడు అని మద్దతుదారుల నేపథ్యంలో నడుపుతున్నారని తెలియజేశారు.. ఏనాడైనా ప్రభుత్వ పాఠశాల వైపు చంద్రబాబు దృష్టి పెట్టారా అంటూ ఎద్దేవా చేశారు కేవలం నారాయణ చైతన్య వంటి కార్పోరేట్లను ప్రోత్సహిస్తూనే ఉన్నారని సీఎం ఫైర్ అయ్యారు.. నాయుడు అతని మద్దతుదారులు దుష్ట చర్యలను ప్రజలు గమనిస్తూ ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు కోరారు. పేద పిల్లల కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకే అమ్మ ఒడి ,విద్యా దీవెన ఇతరత్రా పథకాలను కూడా తీసుకువచ్చామని తెలిపారు. మన ప్రభుత్వం సంక్షేమ పథకాలతో లబ్ధి పొందాలని మీరు భావిస్తే తమకు సైనికులుగా ఉండాలని ప్రజలే అండగా నిలవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: