పొత్తులపై ఏ విషయం తేల్చకుండా చంద్రబాబునాయుడులో బీజేపీ టెన్షన్ పెంచేస్తోంది. పొత్తుపై ఫిబ్రవరి 6వ తేదీన ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబు మాట్లాడొచ్చారు. అప్పటినుండి ఇప్పటివరకు అడుగు కూడా ముందుకుపడలేదు. టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకుంటుందో తెలీదు పెట్టుకోదో తెలీటంలేదు. బీజేపీ అగ్రనేతల మౌనాన్ని ఎలా అర్ధంచేసుకోవాలో కూడా ఎవరికీ అర్ధంకావటంలేదు. పొత్తులపై ఏ విషయమూ తేల్చకపోగా 175 అసెంబ్లీలకు, 25 పార్లమెంటు స్ధానాలకు పోటీచేయాలని అనుకుంటున్న నేతల నుండి దరఖాస్తులు తీసుకున్నది.





వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేస్తోంది. 175 నియోజకవర్గాలకు 2500 దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో నుండి ప్రతి నియోజకవర్గానికి మూడు దరఖాస్తులను ప్రయారిటిబేసిస్ లో ఎంపికచేసింది. అభ్యర్ధి వ్యక్తిగతం, నేపధ్యం, ఆర్ధిక పరిస్ధితి లాంటి అనేక అంశాలను పరిశీలిస్తున్నది. పార్టీ బలోపేతం, ఎన్నికల్లో పోటీచేసే విషయంపైన మాత్రమే దృష్టిపెట్టాలని రాష్ట్రంలోని నేతలకు, దరఖాస్తులు చేసుకున్న నేతలకు అగ్రనేతలు, రాష్ట్రానికి వచ్చిన పరిశీలకులు స్పష్టంగా చెప్పారు. పొత్తు విషయాన్ని కేంద్ర నాయకత్వానికి వదిలేయాలని రాష్ట్ర సంఘటనా కార్యదర్శి శివశంకర్ చెప్పారు.





పార్టీ పరిస్ధితిపై శని, ఆదివారాల్లో విజయవాడలోని పార్టీ ఆఫీసులో శివశంకర్  సమీక్షించారు. జమ్మలమడుగు, శ్రీకాళహస్తి, తిరుపతి, రాజంపేట, చిత్తూరు, ధర్మవరం, గుంతకల్, నంద్యాల, గుంటూరు పశ్చిమ లాంటి కొన్ని నియోజకవర్గాలకు ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. పై నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన పొత్తులో టీడీపీ పోటీచేస్తున్న విషయం తెలిసిందే. కొన్నింటిని వ్యూహాత్మకంగా చంద్రబాబునాయుడు కూడా పెండింగులో పెట్టుంచారు.





ఎంత వ్యూహాత్మకమైనా పొత్తు విషయం ఏదో ఒకటి ఫైనల్ అయిపోతే మిగిలిన 57 మంది అభ్యర్ధులను ప్రకటించేస్తే వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఇపుడు పరిస్ధితి ఎలాగుందంటే స్వేచ్చగా చంద్రబాబు ప్రచారంచేయలేకపోతున్నారు. బీజేపీ పొత్తులో వస్తుందని నమ్మకంగా ఉండలేక, అలాగని రాదనుకుని మిగిలిన 57 స్ధానాల్లో అభ్యర్ధులను ప్రకటించలేక నానా అవస్తలు పడుతున్నారు. బీజేపీ వైఖరిచూస్తుంటే ఎన్నికల నోటిపికేషన్ వచ్చేంతవరకు ఏ సంగతి తేల్చేట్లులేదు. మూడురోజుల్లో పొత్తుపై నిర్ణయం ఉంటుందని సీఎం రమేష్ లాంటి వాళ్ళు చెప్పినా ఎందుకో నమ్మకం కలగటంలేదు. అందుకనే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: