ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి విజేతగా నిలుస్తారనే ప్రశ్నకు ఈ నియోజకవర్గంలో నివశించే ప్రజలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది గత ఐదేళ్లలో బుగ్గన రాజేంద్రనాథ్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారని ఏ సమస్యతో సంప్రదించినా సత్వరమే పరిష్కారం అందేలా కృషి చేశారని చెబుతున్నారు.
 
మరోవైపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనుభవం ఉన్న రాజకీయ నేత కావడంతో పాటు ప్రజల్లో సూర్యప్రకాష్ రెడ్డికి మంచి పేరు ఉంది. ప్రముఖ సంస్థల సర్వేలు సైతం ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా చెప్పలేమని బుగ్గనకు కొంతమేర ఎడ్జ్ ఉందని చెబుతున్నాయి. ఎవరు గెలిచినా డోన్ మరింత అభివృద్ధి చెందడం ఖాయమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
 
మరోవైపు ప్రచార కార్యక్రమాల్లో అటు కోట్ల ఇటు బుగ్గన దూకుడు పెంచారు. ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తామని బుగ్గన ప్రజలకు హామీ ఇస్తుండగా తాను అధికారంలోకి వస్తే డోన్ ప్రజలకు దీర్ఘకాలం పాటు ప్రయోజనం చేకూరేలా పథకాలను అమలు చేస్తానని కోట్ల చెబుతున్నారు. డోన్ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలుస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
"మన బుగ్గనను గెలిపిద్దాం... మన అభివృద్ధిని కొనసాగిద్దాం..." అంటూ బుగ్గన అభిమానులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్ దృష్టిలో బుగ్గనకు మంచి పేరు ఉంది. మరో వందేళ్ల అవసరాలకు అనుగుణంగా బుగ్గన నిర్మాణాలను చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. తాను ప్రజలకు మంచి చేశానని వాళ్లే నన్ను గెలిపిస్తారని బుగ్గన నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో బుగ్గన నమ్మకం నిజమవుతుందో లేక కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి నమ్మకం నిజమవుతుందో చూడాల్సి ఉంది. సాధారణంగా రాయలసీమ జిల్లాలలో ప్రజలు వైసీపీకే అనుకూలంగా ఉన్నారు. ఇక్కడి ప్రజల్లో వైసీపీపై భారీ స్థాయిలో వ్యతిరేకత లేదు. టీడీపీ అభ్యర్థులు ఎంతో కష్టపడితే మాత్రమే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉంటాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: