ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు నేపథ్యంలో ఈసారి ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే టెన్షన్ ప్రధాన నేతల్లో ఉంది. ఈరోజు ఉగాది పండుగ కావడంతో ప్రముఖ జ్యోతిష్కులు చంద్రబాబు జాతకాన్ని పరిశీలించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చంద్రబాబు రాశి కుంభరాశి అని నక్షత్రం శతభిష నక్షత్రం అని ఆయన జాతకంలో జన్మంలో శని ద్వితీయంలో రాహువు ఉన్నాడని జ్యోతిష్కులు వెల్లడించారు.
 
తృతీయంలో గురువు చతుర్థంలో గురువు యొక్క సంచారి అష్టమ స్థానంలో కేతువు ఉన్నట్టు పండితులు చెప్పుకొచ్చారు. ఏపీలో 2024 ఎన్నికలు జరిగే సమయంలో రవి, బుధ, శుక్ర కుజ గ్రహాలు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నాయని జ్యోతిష్కులు పేర్కొన్నారు. జాతకరిత్యా చంద్రబాబుకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని జ్యోతిష్కులు కామెంట్లు చేశారు.
 
2019 ఎన్నికల ఫలితాలతో పోల్చి చూస్తే మాత్రం ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు మెరుగైన ఫలితాలు వస్తాయని అదే సమయంలో కూటమి పోటీ చేస్తున్న కొన్ని స్థానాలలో టఫ్ ఫైట్ కూడా ఎదురవుతుందని జ్యోతిష్కులు తెలిపారు. ప్రధానంగా 55 స్థానాలలో టఫ్ ఫైట్ ఉంటుందని వాళ్లు పేర్కొన్నారు. ఈ 55 స్థానాలలో ఎక్కువ స్థానాలలో ఎవరు విజయం సాధిస్తే ఆ వ్యక్తి సీఎం అవుతారని జ్యోతిష్కులు వెల్లడించారు.
 
చంద్రబాబు కచ్చితంగా సీఎం అవుతారని చెప్పలేదు కానీ సీఎం అయ్యే అవకాశాలు చంద్రబాబుకు కూడా ఉన్నాయని జ్యోతిష్కులు అంచనా వేస్తున్నారు. కొన్ని గ్రహాలు చంద్రబాబుకు పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉండటం మరికొన్ని గ్రహాలు అస్సలు అనుకూలంగా లేకపోవడంతో ఎవరు గెలుస్తారో కచ్చితమైన అంచనా వేయడం కష్టమవుతోందని తెలుస్తోంది. చంద్రబాబు, జగన్ లకు విజయావకాశాలు సమానంగా ఉన్నాయని ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్లకే అనుకూలంగా ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంటుందని జ్యోతిష్కులు భావిస్తున్నారు. చంద్రబాబు ఏపీకి సీఎం అయితే ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని టీడీపీ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: