ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో  హైదరాబాద్ స్థానంలో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎంఐఎం కంచుకోటని బద్దలు కొట్టడమే లక్ష్యంగా ప్రస్తుతం బిజెపి పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే అక్కడ ఎవరిని నిలబెట్టాల అనే విషయంపై ఇక ఎన్నో ప్రణాలికలు వేసుకున్న బిజెపి.. పక్క హిందుత్వ వాది అయిన మాధవి లతకు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది.  ఎంఐఎం ను దెబ్బ కొట్టాలంటే మాధవి లతే సరైన అభ్యర్థి అని బిజెపి భావిస్తుంది.


 హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో విజయం సాధించి.. మజిలీస్ పార్టీ కంచుకోట ను బద్దలు కొట్టి.. ఎంఐఎం పార్టీకి బిగ్ షాక్ ఇవ్వాలని బిజెపి ప్రయత్నాలు చేస్తుంది. అయితే అందుకు తగ్గట్లుగానే మాధవి లత ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. తాను గెలిస్తే ఇక ఎలాంటి అభివృద్ధి చేస్తాను అనే విషయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా ప్రసంగాలు ఇస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పటిలాగానే యాక్టివ్గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బిజెపి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మద్దతుగా అధికార కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఇది రాష్ట్రానికే వ్యతిరేకం అంటూ దుయ్యబట్టారు మాధవి లత. రజాకర్లకు తోడుగా ఉండే వారంతా తన ప్రత్యర్ధులే అంటూ మాధవి లత ప్రకటించారు. అయితే రాబోయే ఎన్నికల్లో తనదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేశారు ఆమె. మజిలీస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో తాను విజయం సాధించి తీరుతాను అంటూ శబథం చేసారు. అయితే ప్రస్తుతం బిజెపి అభ్యర్థి మాధవిలకు తీరు చూస్తే ఎంఐఎం కు షాక్ ఇచ్చేలాగే కనిపిస్తుంది. కానీ ఏం జరుగుతుంది అన్నది అంతా ఓటర్ల చేతిలో ఉంటుంది. చూడాలి ఓటర్లు ఏం డిసైడ్ చేస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tg