ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయ్. ప్రతిపక్ష అధికారపక్ష పార్టీలన్నీ కూడా ఇక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక పార్లమెంట్ స్థానంలో కూడా అక్కడి రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా గెలుపు గుర్రాలను బరిలోకి దింపింది.


 అయితే ఒక్క పార్లమెంట్ స్థానం విషయంలో మాత్రం కాంగ్రెస్ అందరిని కన్ఫ్యూజన్లో పడింది. అదే హైదరాబాద్ పార్లమెంటు స్థానం.  మజిలీస్ పార్టీ కంచుకోటగా పిలుచుకునే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇప్పటివరకు ఇతర పార్టీ గెలిచింది లేదు. అయితే ఈసారి అన్ని పార్టీలు ఇక్కడ విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీ ఏకంగా ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టేందుకు బలమైన అభ్యర్థికి హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ను ఇక అభ్యర్థిగా ప్రకటించింది.


 అయితే మెజారిటీ స్థానాలలో విజయం సాధించి దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ మాత్రం హైదరాబాద్ లో తమ పార్టీ అభ్యర్థి ఎవరు అన్నది ప్రకటించలేదు. దీంతో ఇక ఎంఐఎంకు మద్దతు ఇస్తుందని అందుకే అభ్యర్థిని ప్రకటించలేదని కొంతమంది.. ఇక అక్కడ పోటీ చేయడానికి కాంగ్రెస్ భయపడుతుందని మరి కొంతమంది చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. కాగా నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు  ఈ క్రమంలోనే ఇక కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. దీంతో హైదరాబాద్ అభ్యర్థి ఎవరు అనే ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. హైదరాబాద్ తో పాటు ఖమ్మం, కరీంనగర్ జిల్లాల అభ్యర్థులపై పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపనున్నారని సమాచారం. అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రచారానికి రావాలని ఖర్గే తో పాటు రాహుల్, ప్రియాంకలను ఆయన కోరనున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: