![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/bjp1720dc38-b935-4c5b-af2c-dbfb2031fc81-415x250.jpg)
అయితే హైదరాబాద్లో తప్పకుండా ఓవైసీ ని ఓడించి తీరుతాం అంటూ బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఎంఐఎం ను ఢీకొట్టేందుకు మాధవి లతను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే రాజకీయాల్లో జుట్టు పండిన మహా ఉద్దండులకే హైదరాబాద్లో ఎంఐఎం పై విజయం అసాధ్యమైన పని. అలాంటిది అప్పటివరకు ఏ పార్టీలోని లేని.. కనీసం రాజకీయ అనుభవం లేని మాధవి లత ఎంఐఎం ను ఢీకొట్టడం అంటే యేటికి ఎదురీదడమే అనే భావన చాలామందిలో ఉందట. అయితే అభ్యర్థిని ప్రకటించే నాటికి మాధవి లత ఏ పార్టీలో లేరు. కనీస బిజెపిలో కూడా లేరు కానీ సీట్ తెచ్చుకున్నారు.
డబ్బు పలుకు బడితో పాటు యూట్యూబ్ వీడియోలలో ఆమె ఇంటర్వ్యూలు బాగా వైరల్ కావడంతో పాపులారిటీ వచ్చింది. అయితే ఇక ముందు నుంచి టార్గెట్ పెట్టుకొని బిజెపి టికెట్ కోసమే ఇలా ఇంటర్వ్యూలలో మాట్లాడారేమో అని అనుమానం కూడా చాలా మందికి ఉంది. అయితే యూట్యూబ్ చూసేవారికి మినహా ఎంత మందికి ఆమె తెలుసు అనేది కూడా ఒక డౌట్. ఇంకోవైపు ఓవైసీ జాతీయ స్థాయి నాయకుడు. ముస్లిం ప్రతినిధిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.